డిప్రెషన్ తగ్గడానికి ఆరు చిట్కాలు!

దిగులు వేధిస్తుంటే..
మనసులో ఎప్పుడూ దిగులుగా ఉంటోందా? ఏకాగ్రత తగ్గి డిప్రెషన్ వేధిస్తోందా? అయితే ఈ అలవాట్లతో దాన్నుంచి ఈజీగా బయటపడొచ్చు.
నిద్ర
రాత్రిపూట ఎర్లీగా పడుకుని పొద్దున్నే నిద్ర లేవడం, ప్రతిరోజూ ఏడు లేదా ఎనిమిది గంటలు నిద్ర పోయేలా చూసుకోవడం అలవాటు చేసుకుంటే డిప్రెషన్ చాలావరకూ తగ్గుతుంది.
వ్యాయామం
ప్రతిరోజూ అరగంట సేపు వ్యాయామం లేదా యోగా వంటివి చేయడం తేలికపాటి సంగీతం వినడం వంటి హ్యాబిట్స్ డిప్రెస్డ్ మూడ్ నుంచి బయటపడేందుకు హెల్ప్ చేస్తాయి.
మొబైల్ యూసేజ్
డిప్రెషన్ వేధించే వాళ్లు మొబైల్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా నిద్రపోయే ముందు మొబైల్‌కు దూరంగా ఉండడం ద్వారా డిప్రెషన్ పెరగకుండా జాగ్రత్తపడొచ్చు.
హెల్దీ డైట్
రోజువారీ డైట్‌లో ఆకుకూరలు, పండ్లు, గుడ్లు, చేపలు, నట్స్ వంటి ఆహారాలు ఉండేలా చూసుకుంటే హార్మోన్ల ఇంబాలెన్స్ లేకుండా ఉంటుంది. తద్వారా ఒత్తిడి, డిప్రెషన్ తగ్గుతాయి.
కొత్త హ్యాబిట్స్
మ్యూజిక్, డ్యాన్స్ వంటి కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, ఆటలు ఆడడం, పిల్లలు, ఇష్టమైనవారితో ఎక్కువ సమయం గడపడం ద్వారా డిప్రెషన్ దూరమవుతుంది.
వీటికి దూరంగా
ఆల్కహాల్, స్మోకింగ్ వంటి అలవాట్లు డిప్రెషన్‌ను మరింత పెరిగేలా చేస్తాయి. కాబట్టి వాటిని మానుకోవడం కూడా చాలా ముఖ్యం.