మనకు దగ్గర్లో ఉన్న బెస్ట్ హిల్ స్టేషన్స్ ఇవే!

మాన్‌సూన్ హిల్ స్టేషన్స్
వర్షాకాలంలో హిల్ స్టేషన్స్ అన్నీ పచ్చగా ముస్తాబవడంతోపాటు కొండల మధ్యన ఉండే జలపాతాలు కూడా పరవళ్లు తొక్కుతుంటాయి. ఈ సీజన్‌లో మనకు దగ్గర్లో ఉన్న బెస్ట్ హిల్ స్టేషన్స్ ఏంటో ఓసారి చూద్దాం.
అనంతగిరి హిల్స్
హైదరాబాద్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉండే అనంతగిరి కొండలను మోడరేట్ హిల్ స్టేషన్‌గా చెప్పుకోవచ్చు. మరీ ఎక్కువ ఎత్తులో లేకపోయినా విస్తారంగా ఉండే కొండలు మంచి ఎక్స్‌పీరియెన్స్‌నిస్తాయి.
శ్రీశైలం
హైదరాబాద్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఉండే శ్రీశైలం అడవులు మాన్‌సూన్‌లో చూడదగ్గ్ ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడ ఎత్తైన కొండలతో పాటు అడవుల అందాలను కూడా ఎక్స్‌పీరియెన్స్ చేయొచ్చు.
అరకు
హైదరాబాద్‌కు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న అందమైన హిల్ స్టేషన్‌ అరకు. ఇక్కడ అరకు లోయల అందాలతో పాటు లంబసింగి వంటి హిల్ స్టేషన్స్‌ను కూడా విజిట్ చేయొచ్చు.
చిక్‌మగళూర్
సౌత్‌ ఇండియాలోని బెస్ట్ హిల్ స్టేషన్స్‌లో ఒకటైన చిక్‌మగళూర్.. హైదరాబాద్‌కు 700 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ట్రెకింగ్ ఎక్స్‌పీరియెన్స్‌తో పాటు మంచి వ్యూ పాయింట్‌ను ఎంజాయ్ చేయొచ్చు.
కూర్గ్
హైదరాబాద్‌కు 800 కిలోమీటర్ల దూరంలో ఉండే కూర్గ్ జిల్లా కర్నాటకలో ఉంటుంది. మైసూర్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రాంతంలో బోలెడు హిల్ స్టేషన్స్, వాటర్ ఫాల్స్ కనువిందు చేస్తాయి.
ఊటీ
తమిళనాడులోని ఊటీ హైదరాబాద్‌కు 900 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ‘క్వీన్ ఆఫ్ ది హిల్స్‌’గా పిలిచే ఈ ప్రాంతం వర్షాకాలంలో మరింత స్పెషల్‌గా ఉంటుంది.