ప్రయాణాలు చేసేటప్పుడు సమయానికి తినడం కుదరకపోవచ్చు. అందుకే వెంట శ్నాక్స్ తీసుకెళ్తే.. ప్రయాణాల్లో అలసట లేకుండా ఎంజాయ్ చేయొచ్చు. అయితే శ్నాక్స్ కోసం చిప్స్, కేక్స్ వంటివి కాకుండా కొన్ని హెల్దీ ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటంటే.
నట్స్
జర్నీలు చేసేటప్పుడు నట్స్ మంచి శ్నాక్స్‌గా పనికొస్తాయి. బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్నట్స్ వంటివి నేరుగా తినొచ్చు. లేదా వేగించుకుని కూడా తీసుకెళ్లొచ్చు. ఆకలిగా ఉన్నప్పుడు ఇవి తింటే కొంత రిలీఫ్ ఉంటుంది.
డ్రై ఫ్రూట్స్
ప్రయాణాల్లో ఇన్‌స్టంట్ ఎనర్జీ కోసం డ్రై ఫ్రూట్స్ పనికొస్తాయి. ఎండుద్రాక్ష, ఎండు ఖర్జూరం, డ్రై క్రాన్ బెర్రీ, రైసిన్స్ వటివి వెంట తీసుకెళ్తే ప్రయాణాల్లో అలసిపోయినప్పుడు ఉపయోగపడతాయి.
ప్రొటీన్ బార్స్
మార్కెట్లో దొరికే ప్రొటీన్ బార్స్ కూడా జర్నీ శ్నాక్స్‌గా మంచి ఆప్షన్స్. నట్స్‌తో చేసే ఈ బార్లు ఇన్‌స్టంట్ ఎనర్జీ ఇవ్వడంతోపాటు ఆకలిని కూడా తగ్గి్స్తాయి.
పీనట్ బటర్
ప్రయాణాల్లో తప్పక తీసుకెళ్లాల్సిన శ్నాక్స్ ఇది. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో తినడానికి ఏమీ లేనప్పుడు పీనట్ బటర్ శక్తినిస్తుంది. ఇందులో ప్రొటీన్స్‌తో పాటు హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి.
హనీ మిక్స్
డ్రైఫ్రూట్స్, నట్స్‌ను తేనెలో కలిపి డబ్బాలో పెట్టుకుని తీసుకెళ్లడం ద్వారా ప్రయాణాల్లో ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ప్రొటీన్స్, ఫ్యా్ట్స్‌తో పాటు షుగర్స్ కూడా ఉంటాయి. కాబట్టి ప్రయాణాల్లో ఇన్‌స్టంట్ ఎనర్జీ కోసం దీన్ని తీసుకోవచ్చు.
బ్రౌన్ బ్రెడ్
ప్రయాణాల్లో ఆకలి తీర్చుకునేందుకు బ్రౌన్ బ్రెడ్‌ను కూడా తీసుకెళ్లొచ్చు. బాగా ఆకలిగా ఉన్నప్పుడు బ్రెడ్ నేరుగా తినొచ్చు. లేదా పీనట్ బటర్ లేదా హనీతో టాపింగ్ చేసుకుని తినొచ్చు.