Telugu Global
NEWS

Poco F6 5G | మిడ్‌రేంజ్ స్మార్ట్ ఫోన్ పోకో ఎఫ్‌6 5జీ సేల్స్ షురూ.. రూ.2000 వ‌ర‌కూ డిస్కౌంట్లు ఇలా..!

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుల‌పై ఐదు శాతం క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్ అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్‌. ఇంకా ఎస్బీఐ కార్డులు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల‌పై రూ.2000 వ‌ర‌కూ డిస్కౌంట్ అందిస్తోంది.

Poco F6 5G | మిడ్‌రేంజ్ స్మార్ట్ ఫోన్ పోకో ఎఫ్‌6 5జీ సేల్స్ షురూ.. రూ.2000 వ‌ర‌కూ డిస్కౌంట్లు ఇలా..!
X

Poco F6 5G | ప్ర‌ముఖ స్మార్ట్ ఫోన్ల త‌యారీ సంస్థ పోకో త‌న పోకో ఎఫ్‌6 5జీ (Poco F6 5G) ఫోన్ విక్ర‌యాలు భార‌త్‌లో బుధ‌వారం ప్రారంభించింది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 8ఎస్ జెన్ 3 ఎస్వోసీ (Qualcomm Snapdragon 8s Gen 3 SoC) ప్రాసెస‌ర్‌తో గ‌త‌వారం భార‌త్ మార్కెట్లో పోకో ఎఫ్‌6 5జీ ఫోన్‌ను పోకో ఆవిష్క‌రించింది. మూడు రామ్ విత్ స్టోరేజీ, రెండు క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుందీ ఫోన్‌. 50-మెగా పిక్సెల్ డ్యుయ‌ల్ రేర్ కెమెరా సెట‌ప్‌, 1.5కే రిజొల్యూష‌న్‌తోపాటు ఓలెడ్ డిస్‌ప్లే క‌లిగి ఉంటుందీ పోకో ఎఫ్‌6 5జీ. 90వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తోంది.

పోకో ఎఫ్‌6 5జీ (Poco F6 5G) ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.29,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.31,999, 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.33,999కి ల‌భిస్తాయి. బ్లాక్‌, టైటానియం రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఈ-కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా బుధ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు సేల్స్ ప్రారంభం అయ్యాయి.

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుల‌పై ఐదు శాతం క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్ అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్‌. ఇంకా ఎస్బీఐ కార్డులు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల‌పై రూ.2000 వ‌ర‌కూ డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో పోకో ఎఫ్‌6 5జీ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.25,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.27,999, 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.29,999కి ల‌భిస్తాయి. ఇంకా నెల‌కు రూ.2,500తో నో-కాస్ట్ ఈఎంఐ ఆప్ష‌న్ కూడా అందుబాటులో ఉంది.

పోకో ఎఫ్‌6 5జీ ఫోన్ (Poco F6 5G) ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హైప‌ర్ ఓఎస్ వ‌ర్ష‌న్‌పై ప‌నిచేస్తుంది. 446 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.67 అంగుళాల 1.5 కే (1,220x2,712 పిక్సెల్స్‌) రిజొల్యూష‌న్‌తో అమోలెడ్ డిస్‌ప్లే క‌లిగి ఉంటుంది. మూడేండ్ల పాటు ప్ర‌ధాన ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌, నాలుగేండ్లు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామ‌ని పోకో ధృవీక‌రించింది. ఒక్టాకోర్ 4ఎన్ఎం స్నాప్‌డ్రాగ‌న్ 8ఎస్ జెన్ 3 ఎస్వోసీ ప్రాసెస‌ర్‌పై ఈ ఫోన్ ప‌ని చేస్తుంది.

పోకో ఎఫ్‌6 5జీ (Poco F6 5G) ఫోన్ 50-మెగా పిక్సెల్ 1/9 అంగుళాల సోనీ ఐఎంఎక్స్‌882 సెన్స‌ర్ కెమెరా, 8-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 355 ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 20-మెగా పిక్సెల్ ఓవీ20బీ సెన్స‌ర్ కెమెరా ఉంటుంది. పోకో ఎఫ్‌6 5జీ ఫోన్ (Poco F6 5G) ఫోన్ 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.4, జీపీఎస్‌/ఏజీపీఎస్‌, గెలీలియో, గ్లోనాస్‌, బైదూ, యూఎస్బీ టైప్‌-సీ పోర్ట్ క‌నెక్టివిటీ క‌లిగి ఉంటుంది. ఇంకా యాక్సెల‌రో మీట‌ర్‌, ఆంబియెంట్ లైట్ సెన్స‌ర్‌, ఈ-కంపాస్‌, గైరోస్కోప్‌, ఐఆర్ బ్లాస్ట‌ర్‌, ప్రాగ్జిమిటీ సెన్స‌ర్ ఉంటాయి. ఐపీ 64 రేటెడ్ డ‌స్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ ఉంటుంది. బ‌యో మెట్రిక్ అథంటికేష‌న్ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్‌తోపాటు ఫేస్ అన్‌లాక్ ఫీచ‌ర్‌కు మ‌ద్ద‌తుగా ఉంటుంది. 90వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మ‌ద్ద‌తుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గ‌ల బ్యాట‌రీతో వ‌స్తోంది పోకో ఎఫ్‌6 5జీ (Poco F6 5G). ఫోన్ బాక్స్‌లో 120వాట్ల అడాప్ట‌ర్‌తో వ‌స్తుంది.

First Published:  29 May 2024 4:26 PM GMT
Next Story