NEWS
ఇప్పుడంతా సెల్ఫీల ట్రెండ్ నడుస్తోంది. సెల్ఫీలు దిగాలి…. సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయాలి…. లైకులు, కామెంట్లు చూసి మురిసిపోవాలి. దీనికోసం ఎంతటి ప్రమాదానైనా లెక్క చేయడం లేదు యువత. సరదా కోసం దిగే సెల్ఫీలు…. ప్రమాదాల్ని తెచ్చిపెట్టిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. విచిత్రమైన ఫోజుల కోసం ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్లు ఉన్నారు. అంతేకాదు సెల్ఫీ మరణాల్లో భారత్ టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. అయితే ఎలాంటి ప్రమాదం లేకుండా సేఫ్ గా సెల్ఫీలు దిగామని కొందరు […]
ఆధునిక కాలంలో చర్మ సౌందర్యానికి అష్టకష్టాలు పడుతున్నారు. చిన్న, పెద్ద, ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ అందం, చర్మ సౌందర్యంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. అయితే చర్మ సంరక్షణ కోసం పలు రకాల పదార్థాలను వాడుతున్నారు. వాటిలో సహాజ సిద్ధమైనవి చాలా తక్కువగా ఉంటున్నాయి. క్రీములు, పౌడర్లు వాడితేనే చర్మం సౌందర్యవంతంగా ఉంటుందని భ్రమపడుతుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రీములు, పౌడర్లు బెడిసి కొడుతుంటాయి. దీంతో చర్మం దెబ్బతినే సందర్భాలు ఉంటాయి. క్రీములు, పౌడర్లు […]
చాలా మంది కుర్చీలకు ఫెవికాల్ అంటిపెట్టుకున్నట్లు కూర్చుంటారు. అంతే కాదు గంటల తరబడి కుర్చీలకే అతుక్కుపోతుంటారు. మీరు కూడా గంటల తరబడి ఆఫీసులో కానీ, ఇంట్లో కానీ కూర్చుంటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. మీరు గంటల తరబడి కూర్చుంటే మృత్యువుకు స్వాగతం పలికనట్లే. ఎక్కువ సేపు కూర్చున్నట్లయితే…. త్వరలో గుండె సంబంధిత వ్యాధులను ఎదుర్కోవడానికి రెడీగా ఉండండి అంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల స్థూలకాయం వస్తుందని ఇప్పటికే అధ్యయనాల్లో వెల్లడైంది. ఎక్కువగా కూర్చునట్లయితే […]
మన శరీరానికి ఆయువు రక్తం. రక్తం లేదంటే ఏ వ్యవస్థ కూడా పనిచేయదు. మన శరీరానికి రక్తం ఎంత అవసరమో…ఐరన్ కూడా అంతే అవసరం. శరీరంలో ఐరన్ ఏమాత్రం తగ్గినా…అనారోగ్యానికి గురికావల్సిందే. కాబట్టి ఐరన్ లోపం ఉండకుండా చూసుకోవాలి. ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నట్లయితే…శరీరానికి కావాల్సినంత రక్తం అందుతుంది. అనారోగ్యాల బారిన పడకుండా ఐరన్ మనల్ని కాపాడుతుంది. శరీరంలో ఐరన్ లోపించినట్లయితే… అనేక సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. ఐరన్ లోపిస్తే…. 1. శరీరంలో ఐరన్ లోపిస్తే […]
ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఫ్యాటీ లివర్ వ్యాధి బారిన పడుతున్నారు. మన శరీరంలో చర్మం తర్వాత రెండవ అతి పెద్ద అవయవం కాలెయమే. శరీరంలో ఉండే ప్రతి వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే లివర్ సరిగ్గా పనిచేయాలి. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే లివర్ ఆరోగ్యంగా ఉంటేనే సాధ్యమవుతుంది. అంతేకాదు రక్తంలోని మలినాలను తొలగించడంతోపాటు…ఇన్సులిన్ లెవల్స్ తగ్గించడం, శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపించడంలో లివర్ మెయిన్ రోల్ పోషిస్తుంది. అయితే లివర్ సరిగ్గా పనిచేయకుంటే….ఈ పనులన్నింటికి ఆటంకాలు ఏర్పడటంతోపాటు… […]
ఎలాంటి వ్యాధినైనా తొలినాళ్లలో గుర్తించడం చాలా ముఖ్యం. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులను గుర్తించడం మరింత అవసరం. ఎంత తొందరగా వ్యాధి నిర్థారణకు వస్తే…ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందుకు కారణం వ్యాధికి సంబంధించి చాలామందికి అవగాహన లేకపోవడం…. వ్యాధిని గుర్తించక పోవడం. వ్యాధి ముదిరిన దశలో గుర్తించడం ద్వారా పరిస్థితులు చేజారిపోతున్నాయి. క్యాన్సర్ నియంత్రణ దిశగా ముందడుగు వేశారు ఆస్ట్రేలియాలోని […]
ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఓ కొత్త శకం మొదలైంది. మధురమైన మాతృత్వం అందని ద్రాక్షగా మిగిలినప్పుడు దానిని అందిపుచ్చుకోవడానికి కొత్తదారిని నిర్మించింది టెక్నాలజీ. గర్భం లేని మహిళ తల్లయింది. గుండెపోటుతో మరణించిన మహిళ గర్భాశయాన్ని గర్భాశయం లేని మహిళకు అమర్చడం ద్వారా ఈ అద్భుతాన్ని సాధించారు శాస్త్రవేత్తలు. మరణించిన మహిళ నుంచి సేకరించిన గర్భాశయంతో గర్భధారణ జరిగి ఆరోగ్యంగా బిడ్డ ప్రసవించడం ఇదే తొలిసారి. బ్రెజిల్‌లో డిసెంబర్ నాలుగో తేదీన జరిగిన అద్భుతం ఇది. మేయర్ రోకిటాన్ స్కీ […]
గే, లెస్బియన్లు.. స్వలింగ సంపర్కులు.. వీరికి పిల్లలు పుట్టే అవకాశాలుండవు.. ఎందుకంటే ఆడవారు మగవారుగా…. మగవారు ఆడవాళ్లుగా మారిపోయేలా కొందరు ఆపరేషన్లు చేయించుకుంటారు. సో వీరికి పిల్లలు అసాధ్యం. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది ఓ జంట… ఓ బిడ్డకు జన్మ కూడా ఇచ్చేసింది. వైద్య చరిత్రలోనే ఇదో అద్భుతంగా చెబుతున్నారు. ఈ ఆశ్చర్యపరిచే ఘటన అమెరికా దేశంలోని ఉత్తర టెక్సాస్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. టెక్సాస్ లోని అష్లేయింగ్ కౌల్టర్, బ్లిస్ కౌల్టర్ అనే ఇద్దరు […]
సిగరెట్లు, బీడీలు, చుట్టలు తాగడం, పొగాకు నమలడం వంటి పొగాకు సంబంధిత వ్యసనాల వల్ల దేశంలో ప్రతిఏటా దాదాపు 10 లక్షల మంది చనిపోతున్నారు. పొగాకు వినియోగం దురలవాటని, దాని వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుందని తెలిసినా అనేక మంది ఆ వ్యసనం నుంచి బయట పడలేకపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్లకి సహాయం చెయ్యడం కోసం సిగరెట్, బీడీ, ఇతర పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై క్విట్‌లైన్ టోల్‌ఫ్రీ నంబర్లను కేంద్ర ప్రభుత్వం ప్రచురిస్తోంది. ప్రపంచంలో 46 దేశాలు […]
డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్ మనం చదవగలమా.. చిన్నక్షరాలు కలిపిరాసేస్తుంటారు. అది మందుల షాపు వాళ్లకు తప్ప మనకు అర్ధం కాదు. అందుకే జార్ఖండ్ ప్రభుత్వం ప్రయివేటు డాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అందరికీ అర్ధమయ్యే రీతిలో పెద్ద అక్షరాలతో (కేపిటల్ లెటర్స్‌లో) ప్రిస్క్రిప్షన్ రాయాలని ఆదేశించింది. అంతేకాదు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రయివేటు నర్సింగ్‌హోంలు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నియమనిబంధనలను పాటించాల్సిందేనని ఆదేశించింది. ప్రిస్క్రిప్షన్‌లు పెద్ద అక్షరాలలో రాయడమే కాదు ఆయా మందుల జెనెరిక్ పేర్లను […]