పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని భావిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అలాగే పదేళ్ల కాలంలో పార్లమెంట్ సెషన్‌కు ముందు ఈసారే విదేశీ జోక్యం కనిపించలేదని విపక్షాలకు చురకలు అంటించారు. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మోడీ మీడియాతో మాట్లాడుతూ.. పేదలు, సామాన్యులపై మహాలక్ష్మి కృప మనకు ఎప్పటికీ ఉండాలి. భారత శక్తి సామర్థ్యాలు మనకు విశేష గుర్తింపునిస్తాయి. మూడోసారి ఎన్డీఏకు ప్రజలు పట్టం కట్టారు. పార్లమెంటులో సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం. ఈ బడ్జెట్ ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతున్నదని మోడీ పేర్కొన్నారు. భారత్ అభివృద్ధి లక్ష్యంతో మిషన్ మోడ్‌తో ముందుకు వెళ్తున్నాం. ఇన్నోవేషన్, ఇన్‌క్లూషన్, ఇన్వెస్ట్‌మెంట్ లక్ష్యంతో దూసుకెళ్తున్నామన్నారు.కొత్త విధానాలపైనే ఆర్థిక ప్రగతి ఆధారపడి ఉంటంది. పార్లమెంటులో చరిత్రాత్మక బిల్లలు ప్రవేశపెడుతున్నాం. పార్లమెంటు సమావేశా్లో అన్ని అంశాలపై సమగ్ర చర్చ జరుగుతుంది. ఉభయ సభలు సజావుగా సాగడానికి ప్రతిపక్షాలు సహకరిస్తాయని భావిస్తున్నానిన మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2025 ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండు దశల్లో జరగనున్నాయి.
Previous Articleహైదరాబాద్‌లో గులియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదు
Next Article తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఎస్సై
Keep Reading
Add A Comment