Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Wednesday, June 18
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS»National

    సీ-295 విమానాల ఉత్పత్తి కర్మాగారాన్ని ప్రారంభించిన ప్రధాని

    By Raju AsariOctober 28, 20241 Min Read
    సీ-295 విమానాల ఉత్పత్తి కర్మాగారాన్ని ప్రారంభించిన ప్రధాని
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    గుజరాత్‌లోని వడోదరలో సీ-295 సైనిక రవాణా విమానాల ఉత్పత్తి కర్మాగారాన్ని ప్రధాని నరేంద్రమోడీ స్పెయిన్‌ ప్రధాని పెడ్రో సాంచెత్‌తో కలిసి ప్రారంభించారు. టాటా అడ్వాన్డ్స్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌కు చెందిన ఈ కర్మాగారానికి 2022 అక్టోబర్‌లో మోదీ శంకుస్థాపన చేశారు. భారత్‌కు 56 సీ-295 విమానాల సరఫరాకు 2021 సెప్టెంబర్‌లో రూ. 21,935 కోట్ల ఒప్పందం కుదిరింది. ఇందులో 16 విమానాలు స్పెయిన్‌లోని ఎయిర్‌బస్‌ సంస్థ కర్మాగారం నుంచి అందుతాయి. మిగతావి వడోదర యూనిట్‌లో సిద్ధమౌతాయి. కాలం చెల్లిన ఆవ్రో-748 విమానాల స్థానంలో భారత వాయుసేన వీటిని ప్రవేశపెట్టనున్నది. సీ-295కు సంబంధించి వివిభాగాల ఉత్పత్తి హైదరాబాద్‌లోని ‘మెయిన్‌ కన్‌స్టిట్యూయెంట్‌ అసెంబ్లీ’లో ఇప్పటికే ప్రారంభమైంది.

    ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. భారత్‌-స్పెయిన్‌ సంబంధాలు మరింత బలోపేతమవుతాయన్నారు. భారత్‌లో విమానాలు తయారు చేసి ఎగుమతి చేస్తామన్నారు. భారత్‌ను విమానయాన హబ్‌గా మారుస్తామని ప్రధాని తెలిపారు. భారత్‌-స్పెయిన్‌ భాగస్వామ్యాన్ని పెడ్రో సాంచెజ్‌తో కలిసి సరికొత్త మార్గంలో తీసుకెళ్తున్నామని వెల్లడించారు. ఆ సమయంలో ఇంత పెద్ద రక్షణ పరిశ్రమ భారత్‌లో ఏర్పాటవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇటీవల భారత్‌ తన ముద్దు బిడ్డ రతన్‌ టాటాను కోల్పోయింది. ఇవాళ ఆయన ఇక్కడ ఉండి ఉంటే ఎంతో సంతోషించేవారు. ఆయన ఆత్మ ఎక్కడ ఉన్నా ఈ కార్యక్రమాన్ని చూసి సంతోషిస్తుంది.స్పెయిన్‌ ప్రధాని పెడ్రో సాంచెజ్‌ మాట్లాడుతూ.. ఎయిర్‌బస్‌, టాటాల భాగస్వామ్యం భారత వైమానిక రంగ పురోగతికి బాటలు వేస్తుందన్నారు. ఇతర ఐరోపా దేశాలు భారత్‌కు రావడానికి ఇది ద్వారాలు తెరిచిందన్నారు. 

    ఈ కార్యక్రమానికి ముందు మోదీ, పెడ్రో సాంచెజ్‌ వడోదరాలో రోడ్‌ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంపై రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌ ఎక్స్‌లో స్పందిస్తూ అక్టోబర్‌ 28 భారత వైమానిక రంగంలో ప్రత్యేకమైన రోజుగా అభివర్ణించారు. దీని ప్రారంభోత్సవంలో ఆయన కూడా పాల్గొన్నారు.

     

    PM Modi Tata-Airbus plant
    Previous Articleఇజ్రాయెల్‌ను బెదిరిస్తూ ఇరాన్‌ సుప్రీం పోస్ట్‌
    Next Article 2025లో జనగణనకు సిద్ధమౌతున్న కేంద్రం
    Raju Asari

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.