Telugu Global
National

ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు

ఢిల్లీ నుంచి చికాగో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో విమానాన్ని అత్యవసరంగా కెనడాలోని ఓ విమానాశ్రయానికి దారి మళ్లించారు.

ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు
X

ఢిల్లీ నుంచి చికాగో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దాంతో విమానాన్ని అత్యవసరంగా కెనడాలోని ఇకలూయిట్ విమానశ్రయానికి దారి మళ్లించారు. ఆన్లైన్ పోస్టు ద్వారా అందిన భద్రతా ముప్పు కారణంగా మార్గమధ్యలో ఉన్న A1127 విమానాన్ని మళ్లించినట్టు సంస్థ ప్రకటించింది. ఇటీవల ఫేక్ మెయిల్స్‌తో బెదిరింపులు ఎక్కువయ్యాని వీటిని సంస్థ తీవ్రంగా పరిణిస్తున్నట్లు తెలిపింది..

విమానంతో పాటు ప్రయాణికులందరినీ క్షుణ్నంగా తనిఖీ చేయనున్నట్లు ఎయిరిండియా తెలిపింది. బాంబు బెదిరింపులు నకిలీ ఎక్స్‌ ఖాతాల నుంచి వచ్చాయని, వీటిపై దర్యాప్తు చేస్తున్నట్లు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ వెల్లడించింది.ఈ విషయాన్ని ఎయిర్‌ ఇండియా ఎక్స్‌(ట్విటర్‌)లో తెలిపింది.

First Published:  15 Oct 2024 7:53 PM IST
Next Story