Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Tuesday, June 24
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS»National

    క్యాన్సర్‌ కు కారణమయ్యే వాటికి దూరంగా ఉండండి

    By Raju AsariFebruary 23, 20251 Min Read
    క్యాన్సర్‌ కు కారణమయ్యే వాటికి దూరంగా ఉండండి
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    ప్రజలు క్యాన్సర్‌కు కారణమయ్యే సిగరేట్‌, బీడీ, పొగాకు వంటి వాటికి దూరంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన మధ్యప్రదేశ్‌లోని ఛత్తార్‌పూర్‌లో భాగేశ్వర్‌ ధామ్‌ మెడికల్‌ అండ్‌ సైన్స్‌ రీసెర్చ్‌ సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ…దేశం తనకు ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించిందన్న ప్రధాని.. సబ్‌ కా సాథ్‌ సబ్‌కా వికాస్‌ మంత్రంపై దృష్టి సారించానన్నారు. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న మహాకుంభమేళా దేశ ఐక్యతకు చిహ్నంగా భావితరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. కోట్లాదిమంది తరలివస్తున్న మహాకుంభమేళాలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు సిబ్బందిని ఈ సందర్భంగా ప్రధాని ప్రశంసించారు.

    భారతదేశ మత, సాంస్కృతిక సంప్రదాయాలను వ్యతిరేకిస్తున్న వారిపై ప్రధాని విమర్శలు గుప్పించారు. ఇటీవల కాలంలో ప్రజలను విభజించే నేతల గుంపును చూస్తున్నాం. అనేకసార్లు విదేశీశక్తులు కూడా ఈ వ్యక్తులకు మద్దతు ఇవ్వడం ద్వారా దేశాన్ని బలహీనపరచడానికి యత్నిస్తున్నారు. హిందూ విశ్వాసాన్ని ద్వేషించే వ్యక్తులు శతాబ్దాలుగా ఏదో ఒక దశలో ఉంటున్నారు. బానిస మనస్తత్వం కలిగిన వ్యక్తులు మన విశ్వాసాలు, నమ్మకాలు, ఆలయాలు, మతం, సంస్కృతి, సూత్రాలపై దాడి కొనసాగిస్తున్నారు. వీరు మన పండుగలు, సంప్రదాయాలు, ఆచారాలను దుర్వినియోగం చేస్తారు. మన సమాజాన్ని విభజించడం, తద్వారా ఐక్యతను విచ్ఛిన్నం చేయడమే వారి అజెండా. ఇలాంటి సమయంలో ఎంతోకాలంగా ఐక్యతా మంత్రం గురించి అవగాహన కల్పిస్తున్న ధీరేంద్ర శాస్త్రి… ప్రజల ప్రయోజనాల కోసం పదెకరాల్లో క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించడం గొప్ప విషయం. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో క్యాన్సర్‌ నియంత్రణకు పలు ప్రకటనలు చేశాం. క్యాన్సర్‌ ఔషధాలు మరింత చౌకగా లభించేలా నిర్ణయం తీసుకున్నాం. రాబోయే మూడేళ్లలో దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో క్యాన్సర్‌ డేకేర్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం అని మోడీ అన్నారు. 

    lay foundation stone PM Modi
    Previous Articleఆశా కార్యకర్తలపై దాడి చేసిన పోలీసులను శిక్షించాలి
    Next Article ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్‌ సిటీకి 40 నిమిషాల్లోనే
    Raju Asari

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.