Telugu Global
NEWS

మరో సినిమా ఓకే చేసిన మెగాస్టార్

రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి చిరంజీవి కోసం ఇప్పటికే కథ సిద్ధం చేశాడు. అయితే ఈ సినిమాకు ఆయన దర్శకత్వం వహించడం లేదు.

మరో సినిమా ఓకే చేసిన మెగాస్టార్
X

మెగాస్టార్ చిరంజీవి 69 ఏళ్ల వయసులోనూ వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. త్వరలోనే చిరంజీవి కూడా ఈ సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు. సోషియో ఫాంటసీ కథాంశంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.

విశ్వంభర సెట్స్ పై ఉండగానే చిరంజీవి మరో సినిమాను ప్రకటించారు. కొంతకాలంగా తన తండ్రితో సినిమా చేసేందుకు చిరంజీవి కుమార్తె సుస్మిత ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ - చిరంజీవి కాంబినేషన్లో ఆమె ఓ సినిమా నిర్మించాల్సి ఉన్నప్పటికీ అది ఎందుకో వాయిదా పడింది. ఇప్పుడు సుస్మిత పీపుల్స్ మీడియా సంస్థతో కలిసి చిరంజీవి సినిమాను నిర్మించనుంది.

రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి చిరంజీవి కోసం ఇప్పటికే కథ సిద్ధం చేశాడు. అయితే ఈ సినిమాకు ఆయన దర్శకత్వం వహించడం లేదు. మాస్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తున్నాడు.

ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కొన్ని నెలల పాటు సినిమాలకు విరామం ప్రకటించాడు. ఎన్నికలు పూర్తయ్యాక కూడా సుజిత్ దర్శకత్వంలో చేస్తున్న ఓజీ మూవీని పూర్తిచేశాకే పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ పై దృష్టి పెట్టనున్నాడు. ఈలోపు హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ సినిమాతో పాటు, చిరంజీవి సినిమాను పూర్తి చేస్తాడని తెలుస్తోంది.

First Published:  1 Feb 2024 4:50 PM IST
Next Story