Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Tuesday, June 24
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS

    కేఏ పాల్ క్రేజీ డ్యాన్స్

    By Telugu GlobalOctober 25, 20222 Mins Read
    కేఏ పాల్ క్రేజీ డ్యాన్స్
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    మునుగోడు ఉప ఎన్నికలో రకరకాల విన్యాసాలు ప్రజలను రక్తి కట్టిస్తున్నాయి. అందులోనూ కేఏ పాల్ చేసే విన్యాసాలను చూసి ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన మాటలు, చేతలు ప్రజలకు మంచి కామెడీని అందిస్తున్నాయి. ఆయన ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు.

    మునుగోడులో సర్వే చేశానని, తనకు 87 శాతం మంది మద్దతుగా నిలవగా కేసీఆర్ 14 శాతం మందే సపోర్ట్ చేశారని. ఆ 14 శాతం కూడా కేసీఆర్ కు రావడం ఎక్కువేనని ప్రకటించగల ధీమా పాల్ కు కాకుండా మరెవరికుంటుంది? అంతేకాదు…. తాను మునుగోడులో గెలవబోతున్నానని, కాబోయే ముఖ్యమంత్రిని తానేనని అధికారులను హెచ్చరించగల ధైర్యం మరెవరిలోనైనా చూడగలమా ?

    అందరిలాగా ఆయన మాటల‌తో సరిపెట్టే మనిషి కాదు. రాజకీయ నాయకులంతా ప్రజలకు అబద్దాలో, నిజాలో చెప్పి ఓట్లడుగుతారు.వాళ్ళ సభల్లో ప్రజలను ఎంటర్టైన్ చేయడానికి ప్రత్యేక కళా బృందాలుంటాయి. ఎవరి పని వాళ్ళు చేస్తారు. కానీ కేఏ పాల్ మాత్రం అందరు రాజకీయ నాయకులవలె కాదు. ప్రజలను ఎంటర్టైన్ చేసేదీ ఆయనే, ఓట్లడిగేదీ ఆయనే.

    ఆయన కార్లో కూర్చొని డ్యాన్సులు చేస్తూ ఉంటాడు. సడెన్ గా కారులోంచి కిందికి దూకి నడి రోడ్డు మీద పరిగెడుతుంటాడు. మళ్ళీ ఏదో గుర్తు వచ్చినట్టు ఆగిపోయి అదే రోడ్డు మీద డ్యాన్సు మొదలు పెడతాడు. దాంతో ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన చుట్టూ చేరే ప్రజలకు మాత్రం కొదవ ఉండదు.

    అలాగే తాజాగా ఆయన మునుగోడులో ప్రచారం చేస్తూ చేస్తూ సడెన్ గా ఓ దగ్గర ఆగి ఓ మాస్ ఫోక్ సాంగ్ కు స్టెప్పులు వేయడం ప్రారంభించారు. జనం కేరింతలు, విజిల్స్ తో మరింత రెచ్చి పోయాడు. ఆయనే కొరియో గ్రాఫ్ చేసుకున్న డ్యాన్స్ తో చుట్టూ ఉన్న ప్రజలను ఉర్రూతలూగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.

    ఇలా ఆయన ఏ పని చేసినా సీరియస్ గా చేస్తారు. ఎందుకో జనమే దాన్ని కామెడీగా తీసుకుంటారు.

    ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో డ్యాన్స్‌ చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. #KAPaul #ViralVideo #TelanganaNews #MunugodeBypoll #Eenadu pic.twitter.com/pWY2DzmhWK

    — Eenadu (@eenadulivenews) October 25, 2022

    Crazy Dance KA Paul
    Previous Articleసున‌క్ విజ‌యంపై యుకెలో ప్ర‌వాసభార‌తీయుల హ‌ర్షాతిరేకాలు..
    Next Article TRS Armoor MLA Jeevan Reddy to adopt Dandumalkapur village
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.