Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Saturday, May 17
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS

    బైబై మోదీ సర్.. గుడ్ మార్నింగ్ సీఎం సర్

    By SarviJuly 12, 20222 Mins Read
    బైబై మోదీ సర్.. గుడ్ మార్నింగ్ సీఎం సర్
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    ఇటీవల తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో బైబై మోదీ అనే హ్యాష్ ట్యాగ్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. హోర్డింగ్ లు, బ్యానర్లతో తెలంగాణలో మోదీకి తీవ్ర అవమానం జరిగింది. సోషల్ మీడియాలో పెట్టిన హ్యాష్ ట్యాగ్ లతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇప్పుడు అదే ప్లాన్ ఫాలో అవ్వాలనుకుంటున్నారు జనసైనికులు.

    ఏపీలో రోడ్ల దుస్థితిపై ‘గుడ్ మార్నింగ్ సీఎం సార్’ అనే హ్యాష్ ట్యాగ్ ని వైరల్ చేయాలనుకుంటున్నారు. ఇలా ఈ హ్యాష్ ట్యాగ్ వైరల్ అయితే కచ్చితంగా దేశవ్యాప్తంగా ఇది చర్చకు వస్తుంది, ఏపీలో రోడ్లు ఎలా ఉన్నాయనే విషయం ఇతర రాష్ట్రాలవారు కూడా చూస్తారని, వైసీపీ ప్రభుత్వానికి ఇది కనువిప్పుగా మారుతుందనేది జనసేన ఆలోచన. సీఎంను నిద్రలేపేందుకే ఈ గుడ్ మార్నింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ఉపయోగిస్తున్నామంటున్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్.

    ఏపీలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయంటూ ఫొటోలతో సహా ప్రతిపక్ష మీడియా ప్రతి రోజూ వార్తలిస్తుంటుంది. అదే సమయంలో ప్రభుత్వ అనుకూల మీడియాలో రోడ్లకు మహర్దశ వచ్చిందని, గతంలో చంద్రబాబు రోడ్ల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసినా, వైసీపీ హయాంలో ప్రతి గ్రామానికీ మంచి రోడ్లు పడుతున్నాయని, కావాలంటే ఈ ఉదాహరణలు చూడండి అంటూ నాడు-నేడు ఫొటోలు వేస్తూ హంగామా కనపడుతుంది.

    ఇవి రెండూ వాస్తవాలే. కొన్నిచోట్ల రోడ్లు దారుణంగా ఉన్నాయి, మరికొన్నిచోట్ల మరమ్మతు పనులు మొదలయ్యాయి. అయితే ఇన్నాళ్లూ సమస్యలను అడపాదడపా సోషల్ మీడియాలో ప్రస్తావించిన జనసేన ఇప్పుడు డిజిటల్ యుద్ధానికి సిద్ధమైంది.

    సోషల్ మీడియాలో రచ్చ చేస్తే కచ్చితంగా అది దేశవ్యాప్తంగా హైలైట్ అవుతుంది, ఏపీలో పరిస్థితి ఎలా ఉందో ఇతర రాష్ట్రాలకు తెలుస్తుంది. దీన్ని అవమానంగా భావిస్తే వెంటనే ఆయా రోడ్ల మరమ్మతు పనులు మొదలవుతాయి. ప్రభుత్వం లైట్ తీసుకుంటే మాత్రం ఇలాంటి డిజిటల్ క్యాంపెయిన్లతో ప్రయోజనం ఉండదు. కానీ జనసేన తన ప్రయత్నం మాత్రం మాననంటోంది.

    ఈనెల 15, 16, 17 తేదీల్లో జరిగే డిజిటల్ క్యాంపెయిన్ లో పవన్ కల్యాణ్ కూడా పాల్గొంటారని చెబుతున్నారు. ఏపీలో పెట్రోల్ మీద ప్రతిఏటా సామాన్యుడి నుంచి రూ.750 కోట్లు రోడ్ సెస్ వసూలు చేస్తున్నారని.. ఆ సెస్ చూపించి రూ.6 వేల కోట్లు అప్పులు తెచ్చారని మండిపడ్డారు నాదెండ్ల మనోహర్. ముఖ్యమంత్రికి జవాబుదారీతనం ఉంటే ఆ నిధులను దేనికోసం ఖర్చు చేశారో వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

    Andhra Pradesh AP roads
    Previous Articleథాంక్యూ ట్రయిలర్ రివ్యూ
    Next Article మోదీ, అదానీలపై శ్రీలంక ప్రజల్లో ఆగ్రహం
    Sarvi

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.