బర్డ్‌ప్లూ కారణంగా అమెరికాలో కోడిగుడ్ల ధరలు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ధరలు 15 శాతం పెరిగాయని, రానున్న రోజుల్లో మరో 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశ వ్యాప్తంగా వీటి లభ్యత భారీగా తగ్గడమే ఇందుకు ప్రధాన కారణం. కోడిగుడ్ల కొరత కారణంగా చాలా స్టోర్లలో ‘లిమిటెడ్ స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్ని స్టోర్లలో అయితే, ‘నో స్టాక్’ బోర్డులు కూడా కనిపిస్తున్నాయి. కొనుగోలుదారులకు ఒక్కొక్కరికి రెండు లేదా మూడు కోడిగుడ్ల ట్రేలను మాత్రమే విక్రయిస్తున్నారు.అమెరికా వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం, బర్డ్ ఫ్లూ వ్యాప్తి కారణంగా గత ఏడాది డిసెంబర్ నెలలో సుమారు 2.3 కోట్ల కోళ్లను వధించారు. గత ఏడాది జనవరిలో ఒక కోడిగుడ్డు ధర 2.52 డాలర్లు ఉండగా, డిసెంబర్ నాటికి అది 4.15 డాలర్లకు పెరిగింది. రానున్న రోజుల్లోనూ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది
Previous Articleహైదరాబాద్‌లో ఏఐ కేంద్రం.. ప్రభుత్వంతో ఒప్పందం
Next Article మరో నాలుగు జిల్లాలకు బీజేపీ అధ్యక్షుల ప్రకటన
Keep Reading
Add A Comment