96 ఏళ్ళ బ్రిటన్ రాణి ఎలిజబెత్2 కన్నుమూశారు.బ్రిటన్ చరిత్రలోనే అత్యంత ఎక్కువకాలం 70 ఏళ్ల పాటు ఆమె రాణిగా కొనసాగారు. 1952లో 26 ఏళ్ళ వయసులోనే ఆమె బ్రిటన్ రాణి కిరీటం ధరించారు. . గత అక్టోబర్ నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం తుదిశ్వాస విడిచారు. స్కాట్ల్యాండ్లోని బాల్మోరల్ ప్యాలెస్లో చికిత్స పొందుతున్న రాణి ఎలిజబెత్ గురువారం మధ్యాహ్నం కన్నుమూసినట్టు ప్యాలెస్ వర్గాలు తాజాగా ప్రకటించాయి. రాణి మరణంతో యావత్ బ్రిటన్ శోకసంద్రంలో మునిగిపోయింది.
1926 లో జన్మించిన ఎలిజబెత్2, ప్రిన్స్ పిలిప్ మౌంట్ బాటెన్ ను 1947 లో వివాహం చేసుకున్నారు.