Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Thursday, June 19
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS»International

    LTTEప్రభాకరన్ బతికున్నట్టు ఆధారాలులేవు ..శ్రీలంక ఆర్మీ ప్రకటన‌

    By Telugu GlobalFebruary 13, 20231 Min Read
    LTTEప్రభాకరన్ బతికున్నట్టు ఆధారాలులేవు ..శ్రీలంక ఆర్మీ ప్రకటన‌
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    LTTE ఛీఫ్ వెలుపిళ్ళై ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నట్టు తమిళ నేషనలిస్ట్ మూవ్‌మెంట్ (TNM) నాయకుడు పీ. నెడుమారన్ చేసిన ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయన ప్రకటనను చాలా మంది కొట్టిపడేస్తున్నప్పటికీ నమ్ముతున్నవాళ్ళు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో నెడుమారన్ ప్ర‌కటనలో ఏ మాత్రం నిజం లేదని శ్రీలంక ఆర్మీ ప్రకటించింది.

    శ్రీలంక డైరెక్టర్ మీడియా, ఆర్మీ అధికార‌ ప్రతినిధి బ్రిగేడియర్ రవి హెరాత్ మాట్లాడుతూ, ప్రభాకరన్ చనిపోయినట్లు నిరూపించడానికి శ్రీలంకలో డిఎన్‌ఎ సర్టిఫికెట్లు సహా అన్ని రికార్డులు ఉన్నాయని చెప్పారు.

    “…మా రికార్డుల ప్రకారం, ప్రభాకరన్ జీవించి ఉన్నారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కాబట్టి, మీడియా ఈ విషయంలో రుజువులను, బతికున్నాడని ప్రకటన‌ చేసిన వారినే అడగాలి “అని బ్రిగేడియర్ రవి హెరాత్ అన్నారు.

    2009లో ప్రభాకరన్‌ను శ్రీలంక బలగాలు హతమార్చాయని హెరాత్ చెప్పారు: ” ఆపరేషన్ ముగిసిన 2009 చివరి నాటికి, DNA సర్టిఫికెట్లు, ఈ ధృవీకరణలన్నీ తీసుకున్నాము.” అన్నారు.

    ఈ న సమాచారంపై శ్రీలంక ప్రభుత్వం స్పందించడం గానీ ఏదైనా చర్య తీసుకోవడం కానీ చేస్తుందా? అని అడిగినప్పుడు, హెరాత్, “అలాంటి ప్రణాళికలు లేవు. అయితే సమీప భవిష్యత్తులో విదేశాంగ మంత్రి అధికారిక ప్రకటన ఉండవచ్చు.” అన్నారు

    శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ మాత్రం ఈ అంశంపై ఆచితూచి స్పందించారు. నివేదికలను పరిశీలించి చెప్తానని అన్నారు.

    కాగా, ఈ రోజు తమిళనాడులో జరిగిన విలేఖరుల సమావేశంలో, ప్రముఖ తమిళ జాతీయవాద నాయకుడు పజా నెడుమారన్, ప్రభాకరన్ బతికున్నాడని, త్వరలోనే బైటికి వస్తాడని ప్రకటించారు. తాను ప్రభాకరన్ కుటుంబం అనుమతితోనే ఈ ప్రకటన చేస్తున్నట్టు ఆయన చెప్పారు. 

    No Evidence Prabhakaran
    Previous Articleనీదేం పోయింది..?(కవిత)
    Next Article అదానీ వ్యవహారంపై కమిటీ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.