Telugu Global
International

ఫ్రాన్స్ ర‌చ‌యిత్రికి నోబెల్ సాహిత్య పుర‌స్కారం

సాహిత్యంలో నోబెల్ బహుమతి ఫ్రెంచ్ రచయిత్రి అన్నీ ఎర్నాక్స్ కు దక్కింది. 'ఫర్ ద కరేజ్ అండ్ క్లినికల్ ఆక్యుటీ' పేరుతో ఆమెరాసిన పుస్తకానికి ఈ బహుమతి లభించింది.

ఫ్రాన్స్ ర‌చ‌యిత్రికి నోబెల్ సాహిత్య పుర‌స్కారం
X

ఫ్రెంచ్ రచయిత్రి అన్నీ ఎర్నాక్స్ సాహిత్యంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. ఈ విషయాన్ని నోబెల్ ప్రైజ్ అధికారిక ట్విటర్ హ్యాండిల్ ప్రకటించింది.

'ఫర్ ద కరేజ్ అండ్ క్లినికల్ ఆక్యుటీ' పేరుతో ఆమెరాసిన పుస్తకానికి ఈ బహుమతి దక్కింది. అత్యంత ధైర్యం, కచ్చితత్వంతో వ్యక్తిగత జ్ఞాపకశక్తి మూలాలపై చేసిన కృషికి గాను ఈ పురస్కారం అందిస్తున్నట్లు నోబెల్ కమిటీ పేర్కొంది.

82 ఏళ్ళ ఎర్నాక్స్ 1974 లో రచనలు చేయడం ప్రారంభించారు. మొదట ఆమె ఫిక్షన్ నవలలనే రాసినప్పటికీ తరువాత కాలంలో ప్రధానంగా ఆటోబ‌యోగ్ర‌ఫీలు రాశారు. 1974లో 'లెస్ ఆర్మోయిర్స్ వైడ్స్', 1990లో 'క్లీన్డ్ అవుట్' అనే రచనలు ఆమెకు సాహిత్య ప్రపంచంలో గొప్ప స్థానం కల్పించాయి. ఆమె 300కి పైగా రచనలు చేశారు. 1901 నుంచి ఇప్పటి వరకు సాహిత్యంలో 119 మందికి నోబెల్ బహుమతులు దక్కగా అందులో , ఈ రోజు నోబెల్ బహుమతి సాధించిన ఎర్నాక్స్ తో కలిపి 17 మంది మహిళలు.



First Published:  6 Oct 2022 6:15 PM IST
Next Story