ఉద్యోగులకు సైబర్ సెక్యూరిటీ సంస్థ భారీ షాక్
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకునే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించడం గమనార్హం.
అమెరికాలోని అరిజోనా కేంద్రంగా పనిచేస్తున్న బిషప్ ఫాక్స్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ తన ఉద్యోగులకు ఊహించని షాకిచ్చింది. తన కంపెనీ ఉద్యోగులకు మంచి పార్టీ ఇచ్చిన సంస్థ.. ఉదయానికే 13 శాతం మందిని తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆ ఉద్యోగులకు రాత్రి పార్టీ సరదా ఒక్కసారిగా దిగిపోయింది.
కంపెనీ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయిన ఉద్యోగులు.. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. కంపెనీ నిర్ణయాన్ని అసలు ఊహించలేకపోయామని వారు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకునే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించడం గమనార్హం.
సాంకేతిక రంగంలో కంపెనీ ప్రస్తుతం నమోదు చేస్తున్న గణాంకాలను మరింత మెరుగుపరుస్తామని బిషప్ ఫాక్స్ సీఈవో విన్నే లూ వెల్లడించారు. కంపెనీపై ఆర్థిక భారం తగ్గించుకునేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.