అల్‌ఖైదా చీఫ్ అల్-జవహరీ చనిపోలేదు.. తాలిబన్ల ప్రకటన
అమెరికా చెప్తున్నట్టు అల్-జవహరీ చనిపోలేదని ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల ప్రభుత్వం ప్రకటించింది. దాడి జరిగింది నిజమే కానీ అందులో జవహరీ చనిపోయినట్టు ఎలాంటి ఆధారాలు లేవని తాలిబన్లు చెప్తున్నారు.
BY Telugu Global4 Aug 2022 9:46 AM IST
X
Telugu Global Updated On: 4 Aug 2022 9:56 AM IST
అల్ ఖైదా ఛీఫ్ అల్-జవహరీని ఆఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ సమీపంలో చంపేసినట్లు అమెరికా చెప్తున్న మాటలు నిజం కాదని ఆ దేశ తాలిబన్ల ప్రభుత్వం ప్రకటించింది.
కాబూల్ లో ఓ ఇంట్లో ఆశ్రయం తీసుకుంటున్న జవహరీని డ్రోన్ ద్వారా చంపేసినట్టు అమెరికా ప్రకటించింది. అయితే దాడి జరిగింది నిజమే కాని ఆ దాడిలో జవహరీ చనిపోయినట్టు ఎలాంటి ఆధారాలు లేవని తాలిబన్లు చెప్తున్నారు.
దీనిపై తాము పూర్తి స్థాయి విచారణ జరుపుతామని అందులో పుర్తి నిజానిజాలు తేలుతాయని తాలిబన్ల ప్రతినిధి మీడియాతో చెప్పారు.
Next Story