Gold Rate | అంతర్జాతీయ మార్కెట్లలో పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లలోనూ బంగారం ధర ఒడిదొడుకులకు గురవుతున్నది. పది గ్రాముల బంగారం ధర సుమారుగా రూ.63 వేల మార్క్‌పై ట్రేడ్ అవుతున్నది. 24 క్యారెట్స్ బంగారం తులం ధర సోమవారం రూ.63,050 వద్ద స్థిరపడింది. ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.57,800 వద్ద పలికింది. మరోవైపు కిలో వెండి ధర రూ.76,400 వద్ద నిలిచింది.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలిలా..
ముంబైలో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.57,800 వద్ద స్థిరపడింది. 24 క్యారెట్స్ బంగారం ధర రూ.63,050 వద్ద ముగిసింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఆభరణాల తయారీ కోసం వాడే 22 క్యారెట్స్ బంగారం తులం ధర రూ. 57,950 వద్ద నిలిచింది. ఇక 24 క్యారెట్స్ బంగారం ధర రూ.63,200 వద్ద కొనసాగుతున్నది.
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.58,300 పలికింది. 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.63,600 వద్ద నిలిచింది.
సిటీ పేరు ——— 22 క్యారెట్స్ (తులం ధర) – 24 క్యారెట్స్ (తులం ధర)
అహ్మదాబాద్ —– రూ. 57,850 ——- —— —– రూ. 63,100
గురుగ్రామ్ — —– రూ. 57,950 ——- —— —- రూ. 63,200
కోల్‌కతా —- ——- రూ. 57,800 ——— ———- రూ. 63,050
లక్నో —- ———- రూ. 57,950 —- —– —- —– రూ. 63,200
బెంగళూరు ——- రూ.57,800 —- ———– —– రూ. 63,050
జైపూర్ —- —– —- రూ. 57,950 —- —– —- —- రూ. 63,200
పాట్నా —— ——- రూ. 57,850 —- —- —- —— రూ. 63,100
భువనేశ్వర్ ——– రూ.57,800 —— ——— —– రూ. 63,050
హైదరాబాద్ ——- రూ. 57,800 —– ——— —– రూ. 63,050
మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్) మార్కెట్‌లో ఫిబ్రవరి 5వ తేదీ ఎక్స్‌పైరీ ధర తులం బంగారం రూ.62,321 వద్ద ట్రేడయింది. మరోవైపు కిలో వెండి మార్చి 5వ తేదీ ఎక్స్‌పైరీ ధర రూ. 72,251 పలికింది. ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధర, అమెరికా డాలర్ మీద రూపాయి విలువ, ఆభరణాల తయారీలో లేబర్ ఖర్చులు తదితర అంశాలు కారణం అవుతాయి. భారత్‌లో బంగారానికి సాంస్కృతిక ప్రాముఖ్యం ఉంది. సంప్రదాయంగా పెండ్లిండ్లు, పండుగల వేళ.. పెట్టుబడుల్లోనూ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది బంగారం.