Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Friday, May 23
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Health & Lifestyle

    టైప్ 1.5 డయాబెటీస్.. ఇది యమ డేంజర్

    By Telugu GlobalAugust 29, 2024Updated:March 29, 20252 Mins Read
    టైప్ 1.5 డయాబెటీస్.. ఇది యమ డేంజర్
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    ఆధునిక జీవన విధానంలో వింతైన సమస్యలు తెచ్చిపెడుతోంది అనటంలో సందేహం లేదు. ముఖ్యంగా మనిషిని శారీరకంగా, మానసికంగా పూర్తిగా దెబ్బతిసే వ్యాధులలో షుగర్‌ ఒకటి. మధుమేహం నియంత్రణే తప్ప శాశ్వత చికిత్స లేదు. మధుమేహం అంటేమనకి ఇప్పటి వరకు టైప్‌ 1, టైప్‌ 2 గురించే తెలుసు. కానీ ఇప్పుడు మధుమేహం టైప్ 1.5 డయాబెటిస్ పేరుతో కొత్త రూపంలో మన ముందుకు వచ్చింది. దీన్నే లేటెంట్ ఆటో ఇమ్యూన్ డయాబెటిస్ ఇన్ అడల్ట్స్ అని అంటారు. ఇందులో టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ రెండింటీ లక్షణాలు ఉంటాయి.

    మిగతా వాటితో పోల్చితే డయాబెటీస్ టైప్ 1.5 అనేది మరింత ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని డయాగ్నోసిస్ చేయడం చాలా కష్టమని వైద్యులు అంటున్నారు. ఎందుకంటే ముందు చెప్పుకున్నట్టుగానే ఇందులో టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ రెండింటీ లక్షణాలు ఉంటాయి.టైప్‌ 1 డయాబెటిస్‌ ఉన్నవారిలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే పాంక్రియాస్‌లోని సొంత కణాలను శరీర రోగ నిరోధక వ్యవస్థ నాశనం చేస్తుంది. దీంతో శరీరం ఇన్సులిన్‌ ఉత్పత్తి సామర్థ్యం పూర్తిగా కోల్పోవడం లేదా చాలా తక్కువ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సాధారణంగా ఇది చిన్న వయసులోనే మొదలవుతుంది. ఇక టైప్‌ 2 మధుమేహం సహజంగా వయస్సు పెరిగిన తరువాత మొదలవుతుంది. ఇది ఉన్న వారిలో ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ ఏర్పడుతుంది. వీరిలో ఇన్సులిన్‌ ఉత్పత్తి ఉంటుంది కానీ శరీరానికి సరిపోదు.

    టైప్ 1.5 డయాబెటిస్ అంటే ఏమిటి?

    ఇది టైప్ 1డయోబెటిస్ లాగే మొదలై నెమ్మదిగా పెరుగుతుంది. అందుకే ఈ వ్యాధి బయట పడటానికి చాలా సమయం పడుతుంది. వ్యాధి ఉందని తెలిసిన కొన్ని నెలలు లేదా సంవత్సరం దాకా కూడా ఇన్సులిన్ చికిత్స అవసరం పడకపోవచ్చు. కానీ ఖచ్చితంగా 5 ఏళ్లలోపు ఇన్సులిన్​ను ఉపయోగించాల్సి ఉంటుంది. టైప్ 1.5 డయోబెటిస్ 30 ఏళ్ల దాటిన వాళ్లలో సాధారణంగా కనిపిస్తుంది. ఇది రావడానికి ముఖ్య కారణం సరైన లైఫ్ స్టైల్ మెయిన్‌టైన్ చేయడక పోవడమే. సమయానికి నిద్ర, ఆహారం తీసుకోకుండా ఒత్తిడిని అధికంగా తీసుకోవడమే. అలా అని టైప్ 1.5 డయాబెటిస్ లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు. అధిక దాహం, తరచూ మూత్రం రావడం, అలసట, దృష్టిలో స్పష్టత లోపించడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం వంటివి కొన్ని సార్లు వ్యక్తులను బట్టి మారుతూ ఉండచ్చు. ఈ తరహా లక్షణాలు ఉంటే ఒకసారి డయాబెటిస్ నిర్ధరణ పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఎందుకంటే టైప్‌ 1.5కు కారణం టైప్‌ 1 డయాబెటిస్‌లో ఉండేది కానీ లక్షణాలు మాత్రం టైప్‌ 2 లాంటివి.

    Diabetes Type 1.5 Diabetes
    Previous Articleఆమె పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న పోలీసులకు నోటీసులు
    Next Article Saripodhaa Sanivaaram Movie Review: సరిపోదా శనివారం మూవీ రివ్యూ {2.75/5}
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.