Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Tuesday, May 20
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Health & Lifestyle

    ఉప్పు తగ్గిస్తే ముప్పు తగ్గుతుందన్న WHO- నేడు వరల్డ్‌ హైపర్‌ టెన్షన్‌ డే

    By Telugu GlobalMay 17, 2024Updated:March 29, 20251 Min Read
    ఉప్పు తగ్గిస్తే ముప్పు తగ్గుతుందన్న WHO- నేడు వరల్డ్‌ హైపర్‌ టెన్షన్‌ డే
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    పద్ధతి తప్పిన ఆహారపు అలవాట్లు పలు రకాల జబ్బుల కు దారితీస్తున్నాయి. ఇందులో అధిక ఉప్పు వినియోగం కూడా ఒకటి..సైలెంట్ కిల్లర్ గా చెప్పుకొనే హైబీపీ కి కారణం ఉప్పు. మే 17న వరల్డ్‌ హైపర్‌ టెన్షన్‌ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉప్పు వాడకం అనే అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పందించింది.

    అధిక ఉప్పు వినియోగం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, గుండెపోటు సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్నదని హెచ్చరించింది. రోజుకు ఒక టీ స్పూన్‌ కంటే ఎక్కువ ఉప్పు తింటే రక్తపోటు పెరుగుతుందని తెలిపింది. అంతే కాదు ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే ఏటా ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల మంది ప్రాణాలు కోల్పోకుండా కాపాడవచ్చని తెలిపింది.

     

    పెద్దలు సగటున రోజుకు 4310 మిల్లీ గ్రాములు (సుమారు 10.78 గ్రాముల ఉప్పుకు సమానం) సోడియం తీసుకుంటున్నారని, ఇది తాము సిఫారసు చేసిన పరిమితి 2000 mg (సుమారు 5 గ్రాముల ఉప్పు) కంటే రెండింతలు ఎక్కువని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఎక్కువ ఉప్పు కలిగిన ఆహార పదార్థాలు తినడం వల్ల అన్నాశయ క్యాన్సర్‌, ఊబకాయం, ఆస్టియోపోరోసిస్‌, మెనియర్స్‌, మూత్ర పిండాల వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నదని తెలిపింది.

     

    దీని వల్ల ఏటా 1.89 మిలియన్ల మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించింది. ఎక్కువగా ఉప్పు వినియోగించే అలవాటు మానుకోవటానికి డైనింగ్ టేబుల్ నుండి తొలగించాలంటూ సలహా ఇచ్చింది. ఉప్పు వాడకాన్ని తగ్గించేందుకు ఖర్చు పెట్టే ప్రతి డాలర్‌కు ప్రతిగా 12 డాలర్ల విలువైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వివరించింది. తాజావి , తక్కువగా ప్రాసెస్‌ చేసిన పదార్ధాలు తినడం ద్వారా ఉప్పు వాడకాన్ని తగ్గించొచ్చని డబ్ల్యూహెచ్‌ వో సూచించింది. ఉప్పు బదులుగా సుగంధ ద్రవ్యాలు వాడమని సలహా ఇచ్చింది.

    World Hypertension Day World Hypertension Day 2024
    Previous Articleజైలు నుంచి ప్రపంచకప్ జట్టులోకి నేపాలీ క్రికెటర్!
    Next Article ప్రయాణాలకు రెడీ అవ్వండిలా…
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.