Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Monday, May 19
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Health & Lifestyle

    పిల్లల ఎముకలు బలంగా ఉండాలంటే పెట్టాల్సిన ఫుడ్స్‌ ఇవే..

    By Telugu GlobalJanuary 6, 2024Updated:March 29, 20252 Mins Read
    పిల్లల ఎముకలు బలంగా ఉండాలంటే పెట్టాల్సిన ఫుడ్స్‌ ఇవే..
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    పెద్దలు ఆరోగ్యంగా ఉండటానికి ఏం తినాలి? ఏం తాగాలి అన్న విషయాలపై అవగాహన కలిగి ఉంటారు. దానికి తగ్గట్టే వారికి వారే శ్రద్ద తీసుకుంటారు. కానీ చిన్నపిల్లలకు అలా కాదు. వారికి మమ్ములుగా ఆహారం ఇవ్వడమంటేనే పెద్ద టాస్క్. పిల్లలు ఏదీ సరిగ్గా తినరు, తాగరు. ఒకవేళ ఏమైనా బలవంతంగా పెట్టాలని చూసినా సగం సగం తిని పారిపోతారు. అలా అని పిల్లలకు పోషకాహారం అందకపోతే వారి ఎదుగుదల మీద ప్రభావం పడుతుంది. మరీ ముఖ్యంగా పిల్లలకు సరిపడినంత కాల్షియం, ఐరన్ లభించకపోతే చాలా ఇబ్బందులు, పోషకాహార లోపం ఏర్పడతాయి. వీటిని అధిగమించడానికి పిల్లలకు తెలివిగా ఆహారం ఇవ్వాలి.

    చిన్నతనంలో పిల్లల ఎముకల ఆరోగ్యంపై దృష్టి పెట్టకపోతే.. మున్ముందు జీవితాంతం ప్రభావం చూపుతుంది. ఎముక సాంద్రత తగ్గిపోయి.. ఎముకలు క్షీణించటం, తేలికగా విరిగిపోవటం వంటి ముప్పులు పెరుగుతాయి. చిన్నారుల ఎముకలు దృఢంగా ఉండటానికి, అభివృద్ధి చెందడానికి సమతుల్య ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ఎదుగుతున్న పిల్లల ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారాలను పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..

     

    పాలు..

    పాలు, పాల ఉత్పత్తులలో కాల్షియం, ఫాస్పరస్‌ సమృద్ధిగా ఉంటాయి. ఎముకలు, దంతాలు, గోళ్ల అభివృద్ధికి ఈ పోషకాలు కీలకపాత్ర పోషిస్తాయి. అంతేకాదు పాలలో ప్రొటీన్‌, జింక్‌, విటమిన్‌ A, B2, B12 వంటి పోషకాలు ఉంటాయి. పిల్లలకు రోజూ పాలు ఇస్తే ఎముకల బలంగా ఉండటమే కాదు.. శరీరంలో రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది.

    పెరుగు..

    పెరుగులో కాల్షియం, విటమిన్‌ డి వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. పెరుగులో కాల్షియం, భాస్వరం, ప్రోటీన్, లాక్టోస్ పుష్కలంగా ఉంటాయి. కాల్షియం వల్ల ఎముకలు, దంతాలు గట్టిపడతాయి.

    ఆకుపచ్చ కూరగాయలు..

    పాలకూర పోషకాల ఒక పవర్‌ హౌస్‌. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, విటమిన్‌-ఏ,సి, కె. వంటివి మెండుగా ఉంటాయి. అలాగే మెంతికూర, బ్రొకోలీ, ముల్లంగి ఆకులు వంటి ఆకుపచ్చ కూరగాయల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. పుదీనా, కొత్తిమీర కూడా ఎముకల అభివృద్ధికి, బలంగా ఉండటానికి తోడ్పడతుంది.

    నట్స్, బీన్స్‌..

    డ్రై ఫ్రూట్స్,‌ నట్స్‌లో కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి, దృఢంగా ఉండటానికి తోడ్పడతాయి. మీ పిల్లల డైట్‌లో నట్స్‌ యాడ్‌ చేస్తే.. వారి ఎముకలు బలంగా ఉంటాయి. వాల్ నట్స్, అంజీర, ఖర్జూరం, నేరేడు పండ్లు వంటి గింజలు కాల్షియానికి గొప్ప వనరులు. వీటిలో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే బ్లాక్ బీన్స్, పింటో బీన్స్, కిడ్నీ బీన్స్‌లో మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకల నిర్మాణానికి, అభివృద్ధికి తోడ్పడతాయి.

     

    Children Foods
    Previous ArticleHonda Cars Discounts | హోండా కార్స్ బంప‌రాఫ‌ర్‌.. ఆ రెండు కార్ల‌పై గ‌రిష్టంగా రూ.88,600 వ‌ర‌కూ డిస్కౌంట్లు.. ఈ నెలాఖ‌రు వ‌ర‌కే..
    Next Article Best Smart Phones | రూ.35 వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే.. రెడ్‌మీ నోట్ 13 ప్రో నుంచి వ‌న్‌ప్ల‌స్ నార్డ్ 3 వ‌ర‌కూ.. ఇవీ డిటైల్స్‌..!
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.