Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Monday, May 19
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Health & Lifestyle

    సైకిల్ తొక్కితే సగం రోగాలు పోతాయ్

    By Telugu GlobalJune 10, 2024Updated:March 29, 20252 Mins Read
    సైకిల్ తొక్కితే సగం రోగాలు పోతాయ్
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    ఆరోగ్యానికి వ్యాయామం అత్యంత ప్రధానం. కానీ బిజీబిజీ లైఫ్‌స్టైల్‌ కారణంగా చాలామంది వ్యాయామానికి దూరమవుతున్నారు. తక్కువ శారీరక శ్రమ, డెస్క్‌ జాబ్స్‌ వల్ల చిన్నవయసులోనే అధిక బరువు, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఎక్సర్సైస్ చేయడానికి టైమ్‌ లేనివారికి సైకిలింగ్‌ బెస్ట్‌ ఆప్షన్‌ అని నిపుణులు చెబుతున్నారు. రోజూ కనీసం 30 నిమిషాల పాటు సైక్లింగ్ చేస్తే చాలా లాభాలు ఉన్నాయని అంటున్నారు.​

    రోజూ సైక్లింగ్ చేస్తే మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. అంతేకాకుండా డిప్రెషన్, స్ట్రెస్, యాంగ్జైటీ, అలసట వంటి మానసిక సమస్యలకు దూరమవుతారు. అరగంట సేపు తొక్కడం వల్ల శరీరంలో 250 క్యాలరీలు కరిగిపోతాయి. సైకిల్‌ తొక్కడం వల్ల శరీరంలోని కండరాల సామర్థ్యం పెరుగుతుంది. ఎముకలు మరింత బలంగా మారుతాయి.రోజూ ఉదయాన్నే సైకిల్ తొక్కితే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. రెస్టింగ్‌ పల్స్‌ తగ్గించి, గుండె కండరాలను బలపరుస్తుంది, రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గిస్తుంది. పద్దతి ప్రకారం ప్రతిరోజూ సైక్లింగ్‌ చేయటం మీ గుండె, ఊపిరితిత్తులు, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మీ హృదయ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. శ్వాస సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది.

    రోజూ సైక్లింగ్ చేస్తే పెద్ద ప్రేగు క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే మహిళలు సైకిల్ తొక్కితే బ్రెస్ట్ క్యాన్సర్ వంటి ప్రమాదం 60 శాతం తగ్గుతుందట. కీళ్ల సంబంధిత సమస్యలు తగ్గుతాయి. మధుమేహం రావడానికి ముఖ్య కారణం ఏ పని చేయకపోవడం. అయితే, రోజుకి 30 నిమిషాలు సైకిల్ తొక్కితే శరీరంలో గ్లూకోజ్ పరిమాణం తగ్గి టైప్ 1, టైప్ 2 మధుమేహం కంట్రోల్ అవుతుంది. ఈ వ్యక్తులకు మధుమేహం వచ్చే ప్రమాదం 40 శాతం తక్కువగా ఉంటుందని ఫిన్లాండ్‌లో నిర్వహించిన ఓ పరిశోధనలో గుర్తించారు. ఇక బరువు తగ్గాలనుకునేవారికి సైక్లింగ్ బెస్ట్ వర్కౌట్. దీని వల్ల గంటకి దాదాపు 1200 కేలరీలు బర్న్ అవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి, బరువు తగ్గాలనుకునేవారు రెగ్యులర్‌గా సైక్లింగ్ చేయడం మంచిది. సైకిలింగ్‌ కండరాలను పెంచుతుంది. జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది, శరీరంలో కొవ్వును కరిగిస్తుంది. అందుకే మీరు బరువు తగ్గాలనుకుంటే.. మీ రొటీన్‌లో సైక్లింగ్‌ను కచ్చితంగా చేర్చుకోవాలని నిపుణులు అంటున్నారు.

    bicycle Diseases
    Previous Articleనాద‌ల్ వార‌సుడు.. ఆల్ కోర్ట్ స్టార్‌.. కార్లోస్ అల్క‌రాస్‌
    Next Article ఈ వారం ఓటీటీ వాచ్ లిస్ట్
    Telugu Global

    Keep Reading

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    మహిళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లక్షణాలు

    నిద్ర లేమి సమస్య మహిళలకే ఎక్కువ.. ఎందుకంటే

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.