Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Sunday, May 18
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Health & Lifestyle

    బరువు తగ్గడం కోసం చాట్‌జీపీటీ చెప్పిన డైట్ ప్లాన్!

    By Telugu GlobalJuly 19, 2023Updated:March 30, 20251 Min Read
    బరువు తగ్గడం కోసం చాట్‌జీపీటీ చెప్పిన డైట్ ప్లాన్!
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో అడిగిన ప్రతీ విషయానికి సమాధానం చెప్పే చాట్‌జీపీటీ.. లెటెస్ట్‌గా ఒక యూజర్‌‌కు సరికొత్త డైట్ ప్లాన్‌ను సూచించింది. ఆ డైట్ ప్లాన్‌తో సదరు యూజర్.. 11 కేజీలు తగ్గినట్టు పోస్ట్ చేశాడు. వివరాల్లోకి వెళ్తే..

    బరువు తగ్గడం కోసం చాలామంది డైటీషియన్లను, న్యూట్రిషనిస్టులను సంప్రదిస్తుంటారు. కానీ అమెరికాలోని గ్రెగ్‌ ముస్కెన్‌ అనే వ్యక్తి బరువు తగ్గడం కోసం చాట్‌జీపీటీని సలహా అడిగాడు. అది ఇచ్చిన డైట్ ప్లాన్‌తో ఏకంగా 11 కేజీలు తగ్గాడు. ఒబెసిటీతో బాధపడుతున్న గ్రెగ్‌.. వాకింగ్, రన్నింగ్‌ లాంటి వ్యాయామాలు కూడా చేయలేకపోతున్నాడట. దీంతో చాట్‌జీపీటీకి తన పరిస్థితి చెప్పి సలహా ఇవ్వమన్నాడు. చాట్‌జీపీటీ ఇచ్చిన సూచనల సాయంతో హెల్తీ డైట్‌ ప్లాన్‌ రెడీ చేసుకున్నాడు. చాట్‌జీపీటీ చెప్పిన డైట్ ప్లాట్ మూడు నెలలు పాటించిన తర్వాత కాస్త యాక్టివ్‌గా మారాడు. దాంతో వారానికి ఆరు రోజులు రన్నింగ్‌ చేయగలిగాడు. అలా మరిన్ని వర్కవుట్‌లపై ఆసక్తి పెంచుకున్నాడు. అలా మూడు నెలలు తిరిగే సరికి 11 కేజీల బరువు తగ్గాడట. చాట్‌జీపీటీ ఇచ్చిన డైట్‌ ప్లాన్‌ను గ్రెగ్‌ ముస్కెన్ మొదట్లో నమ్మలేదట. కానీ ఆ ప్లాన్‌ చాలా ఈజీగా ఉంటడంతో ఫాలో అయ్యానని చెప్తున్నాడు.

    గ్రెగ్ ఇచ్చిన సూచనలను బట్టి చాట్‌జీపీటీ అతనికి తేలికపాటి ఆహారం తీసుకోవడం, రన్నింగ్‌ షూస్‌ను ఫ్రంట్‌ డోర్‌కి దగ్గరగా పెట్టుకోవడం వంటి చిన్నచిన్న సలహాలను ఇచ్చింది. అలా గ్రెగ్‌.. కొద్దికొద్దిగా నడవడం, రన్నింగ్ చేయడం ప్రారంభించాడు. చిన్నగా మొదలుపెట్టి.. రోజురోజుకు వర్కవుట్లు పెంచుకుంటూ పోయాడు. అలా చిన్న చిన్న మార్పులతోనే ఎక్కువ బరువు తగ్గాడు. అయితే అందరికీ ఒకేరకమైన డైట్, వ్యాయామాలు సూట్ అవ్వవు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్లు డాక్టర్ సలహా తీసుకోవడం కూడా ముఖ్యమే.

    ChatGPT Weight Loss Tips in Telugu
    Previous Articleమేకప్ లేకపోయినా.. అందంగా కనిపించాలంటే..
    Next Article 21న జాలాది రత్నసుధీర్‌ కథా సంపుటి ఆవిష్కరణ
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.