Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Tuesday, May 20
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Health & Lifestyle

    డయాబెటిస్‌ను ముందే గుర్తించండిలా..

    By Telugu GlobalJuly 5, 2024Updated:March 29, 20252 Mins Read
    డయాబెటిస్‌ను ముందే గుర్తించండిలా..
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    ఈ రోజుల్లో ఎక్కువమందిని వేధిస్తున్న వ్యాధుల్లో డయాబెటిస్ మొదటిస్థానంలో ఉంది. మనదేశంలో సుమారు పది శాతం మంది అంటే సుమారు పది కోట్ల మంది ఈ సమస్యతో భాధపడుతున్నారు. అయితే డయాబెటిస్‌ను ముందుగా గుర్తించకపోవడం వల్లనే సమస్య ముదురుతోందని డాక్టర్లు చెప్తున్నారు. డయాబెటిస్‌ను ముందుగానే ఎలా గుర్తించొచ్చంటే.

    డయాబెటిస్ వచ్చే ముందే శరీరంలో కొన్ని సూచనలు కనిపిస్తాయి. ఈ స్టేజ్‌నే ప్రీడయాబెటిక్ స్టేజ్ అంటారు. అయితే ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడే సమస్యను అంచనా వేసి సరైన జాగ్రత్తలు తీసుకుంటే సమస్య ముదరకుండా ఉంటుంది.

    శరీరంలోని షుగర్ లెవల్స్‌లో మార్పులు వచ్చినప్పుడు అతిగా దాహం వేయడం, తరచూ మూత్రానికి వెళ్లాల్సిరావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి మార్పులు గమనిస్తే కచ్చితంగా షుగర్ టెస్ట్ చేయించాలి. అలాగే షుగర్ లెవల్స్ పెరిగినప్పుడు ఆకలి పెరగడం, ఆయాసం, అలసట వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ వ్యాధి ముదరకుండా ఉంటుంది.

    గాయాలు త్వరగా మానకపోవడం, కంటి చూపు మసక బారడం వంటివి కూడా డయాబెటిస్‌కు ముందస్తు లక్షణాలే. కాబట్టి ఇలాంటి మార్పులు గమనించినప్పుడు కూడా ఓసారి షుగర్ లెవల్స్ చెక్ చేసుకోవడం మంచిది.

    జాగ్రత్తలు ఇలా..

    శరీరంలో షుగర్ లెవల్స్ పెరిగినట్టు గుర్తిస్తే.. దాన్ని ప్రీడయాబెటిక్ స్టేజ్‌గా గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిస్ రిస్క్‌ను తగ్గించేందుకు ముందుగా డైట్‌లో మార్పులు చేసుకోవాలి. హైక్యాలరీ ఫుడ్స్‌ను తగ్గించి ఫైబర్ ఉండే ఫుడ్స్‌ను ఎక్కువగా తీసుకోవాలి. పండ్లు, ఆకుకూరలను డైట్‌లో చేర్చుకోవాలి.

    ప్రీ డయాబెటిక్ స్టేజ్ నుంచే వ్యాయామం చేయడం అలవాటు చేసుకుంటే షుగర్ సమస్య ముదరకుండా, బరువు పెరగకుండా జాగ్రత్తపడొచ్చు. రోజుకి కనీసం ఇరవై నిముషాల పాటైనా వ్యాయామం చేస్తే.. ఇన్సులిన్ పనితీరు కూడా మెరుగుపడుతుంది.

    ఇకపోతే స్మోకింగ్ అలవాటు, నిద్ర లేకపోవడం, ఒత్తిడి వంటివి డయాబెటిస్ రిస్క్‌ను మరింత పెంచుతాయి. కాబట్టి వాటిని మార్చుకోవాలి. స్మోకింగ్ పూర్తిగా మానేయాలి. రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర పోవాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.

    Diabetes Diabetes Tips in Telugu
    Previous ArticleTata Punch | ఈ స‌బ్‌-4 మీట‌ర్ కంపాక్ట్ ఎస్‌యూవీ కారు దేశంలో టాప్ సెల్లింగ్.. ఇదేం ఎక్స్‌ట‌ర్‌.. స్విఫ్ట్‌.. వ్యాగ‌న్ ఆర్‌.. ఐ20 కానేకాదు
    Next Article పారిస్ ఒలింపిక్స్ అథ్లెటిక్స్ జట్టులో ఒకే ఒక్క తెలుగు అథ్లెట్!
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.