సమ్మర్‌లో స్కిన్ ట్యాన్‌ను తగ్గించండిలా
సమ్మర్‌లో వేడి, చెమటల కారణంగా చర్మంలో డెడ్ సెల్స్ ఎక్కువవుతుంటాయి.
సమ్మర్‌లో వేడి, చెమటల కారణంగా చర్మంలో డెడ్ సెల్స్ ఎక్కువవుతుంటాయి. అందుకే సమ్మర్‌లో అలా బయటకు వెళ్లిరాగానే చర్మం ట్యాన్ అయ్యి కమిలిపోతుటుంది. ఇలా జరగకూడదంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే..
చర్మం నుంచి డెడ్ సెల్స్ బయటకొస్తేనే స్కిన్ తాజాగా ఉంటుంది. అందుకే సమ్మర్ లో బయటనుంచి వచ్చిన ప్రతి సారి ఫేస్ వాష్ చేసుకోవాలి.
చర్మంపై డెడ్ సెల్స్ తొలగించడం కోసం స్నానం చేసేముందు ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్‌తో చర్మాన్ని మసాజ్ లేదా స్క్రబ్ చేసుకోవాలి.
సమ్మర్‌లో బయటికి వెళ్లే ముందు ఎస్‌పీఎఫ్ 30 ఉన్న సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం ద్వారా స్కిన్ ట్యాన్ అవ్వకుండా జాగ్రత్తపడొచ్చు.
సమ్మర్‌లో సన్ ట్యాన్‌ను తొలగించేందుకు రోజ్ వాటర్‌లో కాటన్ బాల్‌ను ఉంచి ట్యాన్ అయ్యిన ప్రాంతంలో రుద్దాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లలో కడిగేస్తే ట్యానింగ్ తగ్గుతుంది.
ఓట్స్ పొడిలో ఆలివ్ ఆయిల్, తేనె కలిపి తయారు చేసిన మిశ్రమం కూడా సమ్మర్‌లో మంచి ఫేస్ ప్యాక్‌గా పనికొస్తుంది. ఈ ప్యాక్ వేసుకుంటే సన్ ట్యాన్ వల్ల కమిలిపోయిన చర్మం తాజాగా మారుతుంది.
ఎండ వల్ల కమిలిపోయిన చర్మాన్ని రిపేర్ చేసేందుకు బొప్పాయి, పుచ్చకాయ గుజ్జు చక్కగా పనిచేస్తుంది. బొప్పాయి లేదా పుచ్చకాయ గుజ్జులో నిమ్మరసం కలిపి ట్యాన్ అయిన చోట అప్లై చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది.
ఇక వీటితోపాటు విటమిన్ సీ ఉండే సిట్రస్ ఫ్రూట్స్ ఫేస్ ప్యాక్స్‌తో కూడా సన్ ట్యాన్ మచ్చలను తొలగించుకోవచ్చు. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం ద్వారా చర్మం ఎప్పటికప్పుడు రిపేర్ అవుతుంటుంది.