Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Tuesday, May 20
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Family

    ఎవరికైనా సలహా ఇచ్చేముందు.. ఇవి గుర్తుంచుకోవాలట!

    By Telugu GlobalMay 3, 20242 Mins Read
    ఎవరికైనా సలహా ఇచ్చేముందు.. ఇవి గుర్తుంచుకోవాలట!
    ఎవరికైనా సలహా ఇచ్చేముందు.. ఇవి గుర్తుంచుకోవాలట!
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    ప్రపంచంలో సులువుగా లభించేది ఏదైనా ఉంటే అది సలహానే! కొంతమంది అవసరం ఉన్నా లేకపోయినా ఉచిత సలహాలు పడేస్తూ ఉంటారు. కానీ మరికొంత మంది మాత్రం ఆచితూచి ఉపయోగపడే సలహాలిస్తుంటారు. ఇచ్చే సలహా సరైనది అయితే.. అది మరొకరి జీవితాన్ని కాపాడుతుంది. సమస్యను ధైర్యంగా ఎదుర్కొనేలా చేస్తుంది. అందుకే సలహా ఇచ్చేముందు కొన్ని విషయాలు ఆలోచించాలంటున్నారు నిపుణులు. అవేంటంటే..

    -అవతలివారి సమస్య మనకు మామూలుగా అనిపించినా, దానికి సొల్యూషన్ మన దగ్గర ఉందనిపించినా.. అడగకుండా ఇచ్చే సలహాకి వాల్యూ ఉండదు కాబట్టి.. అడిగే దాకా సలహాలు ఇవ్వకూడదు. ముఖ్యంగా అవతలి వ్యక్తితో అంత చనువు లేనప్పుడూ, నలుగురిలో ఉన్నప్పుడు అస్సలు ఇవ్వకూడదు. తొందరపడి ఇచ్చే సలహా వాళ్లని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అందుకే ఒకవేళ ఆ సమస్యకు మీ దగ్గరే సొల్యూషన్ ఉందనిపిస్తే ఆ వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు అవసరాన్ని బట్టి సలహాను వివరంచి చెప్పాలి.

    కొంతమంది వచ్చిన ప్రాబ్లెమ్ గురించి పదేపదే, ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటారు. పక్కవారికి చెప్పుకుని కాస్త రిలాక్స్ అవడం కోసం అలా చేస్తుంటారు. అలాంటప్పుడు ఆ మాటలు ఓపిగ్గా వినాలి. మనకి విసుగు అనిపించినా, వారిని అడ్డుకోకుండా డిస్కషన్ కొనసాగించాలి. వీలైతే ఇంకా ప్రశ్నలు అడిగి, సమస్యలోని అన్ని కోణాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాలి.

    -సమస్య మనది కాకపోయినా… సలహా ఇచ్చేది మనమైనప్పుడు.. ఆ సమస్యను మనదిలానే చూడాలి. సమస్యని కాసేపు మనదిగా భావిస్తేనే, అందులోని లోటుపాట్లు తెలుస్తాయి. అలా కాకుండా జస్ట్ ఒక మూడో వ్యక్తిగా చూస్తే.. సమస్య చాలా తేలికగా కనిపిస్తుంది. పరిష్కారం కూడా అలాగే ఉంటుంది.

    సలహా కోసం వచ్చారు కదా అని చాలామంది అవతలి వారిని చులకనగా చూస్తుంటారు. కానీ అవతలివారు తమమీద నమ్మకంతో వచ్చారన్న సంగతి గుర్తుంచుకోరు. అందుకే ఎవరైనా సలహా అడిగినప్పుడడు, సమస్యను విని, నిజాయితీగా తోచిన సలహాను ఇవ్వాలి.

    సలహా అడిగారు కదా అని అవతలివారిని తక్కువ చేసి ‘అంతా నాకే తెలుసు’ అన్నట్టు వ్వవహరించకూడదు. సమస్య గురించి మనకు తోచిన అభిప్రాయాలు, పరిష్కారాలు… అన్నీ అవతలివారితో చర్చించి నిర్మొహమాటంగా తేల్చేయాలి. అప్పుడే సలహా ఇవ్వడం ఒక కాలక్షేపంగా కాకుండా ఉపయోగకరంగా ఉంటుంది.

    ప్రాబ్లమ్‌లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్‌ను సలహాలు అడగడం సహజం. అలాగే అడక్కుండా కూడా కొన్నిసార్లు సలహాలు ఇవ్వాల్సి రావొచ్చు. సందర్భం ఏదైనా సలహాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరికైనా ఆలోచనా సామర్థ్యం తగ్గిపోతుంది. అలాంటప్పుడు ఎదుటివారి సలహాలనే సీరియస్‌గా పాటిస్తారు. కాబట్టి సలహాల విషయంలో రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలనేది నిపుణుల సూచన.

    advice Before giving advice
    Previous Articleకోవీషీల్డ్ వ్యాక్సిన్‌తో గుండెపోటు వస్తుందా? డాక్టర్లు ఏమంటున్నారు?
    Next Article ప్రియురాలి ఇంటికి పార్సిల్ బాంబు.. అది పేలి తండ్రి, కుమార్తె దుర్మరణం
    Telugu Global

    Keep Reading

    ఈ ఊళ్లు ఆడవాళ్లకు మాత్రమే!

    మహిళలూ… ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ఇలా జాగ్రత్త పడండి

    చంద్రునిపై బ్లూఘోస్ట్‌ ల్యూనార్‌ ల్యాండర్‌ను దించడానికి నాసా సిద్ధం

    మహిళా రైతులకు అనువుగా మహీంద్రా ట్రాక్టర్లు

    జాబిల్లిపైకి ప్రైవేట్‌ కంపెనీ ‘గ్రేస్‌’ డ్రోన్‌

    ‘మ్యాడ్‌2’ టీజర్‌ విడుదల..ఫ్యాన్స్‌కు పూనకలే

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.