DEVOTIONAL

ఇంద్రజిత్తు (Indrajit) ఎవరో తెలుసా? రావణుని పెద్ద కుమారుడు. ఇతని అసలు పేరు మేఘనాధుడు. మరి ‘ఇంద్రజిత్తు’ అని పేరు ఎలా వచ్చిందని దూ మీ అనుమానం? మేఘనాధుడు మహేశ్వర క్రతువు చేశాడు. తండ్రితో తనూ కలిసి వెళ్లి ఇంద్రుడితో యుద్ధానికి దిగాడు.

మనం సినిమాల్లో పేద్ద పేద్ద రాక్షసుల్ని చూస్తూ ఉంటాం. రాక్షసుల దగ్గర రాజులైనా సరే లిల్లీపుట్టుల్లా ఉంటారు. రాక్షసులు తాటిచెట్లనైనా పూచిక పుల్లల్లా పీకి పారేస్తూ ఉంటారు. కొండల్ని, పెద్ద పెద్ద బండల్ని గోళీకాయల్లా విసిరేస్తూ ఉంటారు. వాళ్ల కాళ్లు ఏనుగు కాళ్లలా ఉంటాయి.వాళ్ల చేతులు మర్రి ఊడల్లా పొడవుగా ఉంటాయి.

పురాణ ఇతిహాసాల్లో మర్కటాన్ని పోలిన ఆంజనేయుడు, నందిగా దర్శనమిచ్చిన నందీశ్వరుడు, పక్షి జాతికి చెందిన గరుత్మంతుడు, సర్పజాతికి చెందిన నాగరాజు ఇలా చాలా మందిని చూస్తుంటాం కదా?, అలాగే భల్లూక జాతికి చెందిన జాంబవంతుడు యతి వృద్ధుడుగా మనకు దర్శనమిస్తాడు. ఎలుగు బంటిని పోలిన మనిషిని చూస్తే మహాశ్చర్యం కలుగుతుందేం?!, మరందునే జాంబవంతుడి గురించి తెలుసుకుందాం! బ్రహ్మదేవుడు ఆవులించగా జాంబవంతుడు పుట్టాడని చెపుతారు.

Kumbhakarna (కుంభకర్ణుడు): ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఒళ్ళు మరచి నిద్రపోయే వాళ్ళని కుంభ కర్ణులనడం వింటూ వుంటాం. అలాగే ఎంతపెడితే అంతా తినే వాళ్ళని కూడా కుంభకర్ణులనే పిలుస్తాం.

మార్కండేయుడు (Markandeya): ఏజీవికయినా చావు పుట్టుకలు ఉంటాయి! లేకుండా ఉండే వీలే లేదు! “పుట్టిన వారికి మరణం తప్పదు! అనివార్యమగు ఈ కార్యం గురించి శోకింపతగదు!” అని గీత కూడా చెప్పింది! పుట్టుక తప్ప చావు లేని సందర్భం యెప్పుడైనా యెక్కడైనా ఉందా? అంటే “వుంది” అని మార్కండేయుని కథ చెపుతోంది! చావుని గెలవడం బతుకేనా?

Inequality: మహా పురుషులెవరయినా ఏవో కథలు చెబుతారు. కథల ద్వారా చెబితే పిల్లలకయినా పెద్దలకైనా మనసుని హత్తుకుంటుంది. జీసెస్‌ ఈ పిట్టకథని పదే పదే చెప్పేవాడు.

భగవద్గీతలో సంశయాత్మా వినశ్యతి ‘అన్న మాట వుంది. సందేహించిన వాడు నశిస్తాడు’ అని ఆ మాటకు అర్ధం. దానికి దృష్టాంతమయిన కథ ఇది. ఒక గ్రామంలో ఒక సాధువు ధర్మ ప్రవచనాలు చేసేవాడు. ఆయన ఉన్నత ఆధ్యాత్మిక శిఖరాల్ని అందుకున్నవాడు.భూత భవిష్యత్‌ వర్తమనాలు తెలిసిన జ్ఞాని. ఆయన ప్రవచనాలు వినడానికి ఎందరో భక్తులు వచ్చే వాళ్ళు.

ప్రాచీనయుగాల్లో మన పురాణాల్లో జనమహారాజును గొప్పజ్ఞానిగా భావిస్తాం. ఆయన మహారాజయినా నిత్యం తత్వ చింతనలో, జ్ఞాన చర్చల్లో మునిగివుండేవాడు. దేశదేశాల నుండి ఆయన దర్శనం కోసం ఎందరో మహాపురుషులు వచ్చేవాళ్ళు.