పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఎస్సై ఎ.జి.ఎస్.మూర్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తణుకు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించిన ఎస్సై ఇటీవల సస్పెన్షన్‌కు గురయ్యారు. బర్రెల అపహరణ కేసులో మూర్తిపై పలు ఆరోపణలు రావడంతో ఆయనను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అనంతరం వీఆర్‌లో ఉన్న మూర్తి.. శుక్రవారం ఉదయం పెనుగొండలో సీఎం పర్యటన బందోబస్తుకు వెళ్లే క్రమంలో పీఎస్‌కు వచ్చారు. కొద్దిసేపు అక్కడే కూర్చొని.. ఆ తర్వాత బాత్‌రూమ్‌లోకి వెళ్లి తుపాకీతో కాల్చుకుని చనిపోయారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
Previous Articleఈ బడ్జెట్ ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుంది
Next Article ఆర్థిక సర్వే విడుదలకు ముందు దూసుకెళ్లిన సూచీలు
Keep Reading
Add A Comment