హన్మకొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కమలాపూర్ మండలంలోని అంబాల వద్ద సోమవారం కూలీలను తరలిస్తోన్న ఆటో ట్రాలీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మందికి తీవ్ర గాయాలు కాగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే గాయపడ్డ వారిని అంబులెన్సుల్లో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Previous Articleఅంబేద్కర్‌ను అవమానించిన అమిత్ షాపై చర్యలు తీసుకోవాలి
Next Article ఒక్క రోజులో రూ.10 లక్షల కోట్లు ఉఫ్!
Keep Reading
Add A Comment