వివాదాస్పద సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ శుక్రవారం ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ ఫొటోల మార్ఫింగ్ కేసులో సీఐ శ్రీకాంత్ బాబు ఆర్జీవీని విచారిస్తున్నారు. ఫొటోలు మార్ఫింగ్ చేశారని 2024 నవంబర్ 10న మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆదారంగా వర్మను విచారించేందుకు గతంలో పోలీసులు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. ఈ కేసులో రాంగోపాల్ వర్మను అరెస్టు చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది. విచారణకు సహకరించాలని ఆర్జీవీకి సూచించింది. ఈక్రమంలో ఆర్జీవీ విచారణకు హాజరయ్యారు. వైసీపీ ముఖ్య నాయకులతో ఆయనకున్న సంబంధాలు, ఫొటోలు ఎందుకు మార్ఫింగ్ చేశారు అనే అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
Previous Articleహైదరాబాద్‌లో గ్యాంగ్ రేప్ ..బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారం
Next Article కోర్టులో కేసుండగా ఎలా వస్తారు.. ఓవర్ యాక్షన్ చేయకు
Keep Reading
Add A Comment