భూవివాదంవల్లే రాజలింగమూర్తి హత్య
భూపాలపల్లిలో హత్యకు గురైన రాజలింగమూర్తి హత్యను ఛేదించిన పోలీసులు
BY Raju Asari23 Feb 2025 12:53 PM IST

X
Raju Asari Updated On: 23 Feb 2025 12:53 PM IST
భూపాలపల్లిలో హత్యకు గురైన రాజలింగమూర్తి హత్యకేసును పోలీసులు ఛేదించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణం అంటూ కేసు వేసిన రాజలింగమూర్తి బుధవారం హత్యకు గురైన విషయం విదితమే. ఈ కేసు వివరాలను పోలీసులు ఆదివారం వెల్లడించారు. జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే మాట్లాడుతూ.. ఎకరం భూవివాదం వల్లే రాజలింగమూర్తి హత్య జరిగింది. 10 మంది నిందితుల్లో ఏడుగురిని అరెస్టు చేశాం. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని వెల్లడించారు. నిందితుల నుంచి 2 కత్తులు, 2 రాడ్లు, 5 బైక్‌లు, 7 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు కలిసి హత్య చేయగా ఇద్దరు రెక్కీలో పాల్గొన్నారు. మిగతా వారు వారికి సహాయం చేశారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నదని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Next Story