Telugu Global
CRIME

ఓబులవారిపల్లె పీఎస్‌కు పోసాని

ఓబులవారిపల్లె పీఎస్‌కు పోసాని
X

వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారి పల్లె పీఎస్‌కు తీసుకొచ్చారు. హైదరాబాద్‌లోని రాయదుర్గంలో మైహోమ్‌ భూజాలో అదుపులోకి తీసుకున్న తర్వాత నేరుగా ఇక్కడికి తీసుకొచ్చారు. పోలీస్‌స్టేషన్‌లోనే ప్రభుత్వ డాకర్ట్‌ ఆధ్వర్యంలో పోసానికి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఆయన స్టేట్‌మెంట్‌ను రైల్వేకోడూరు సీఐ రికార్డు చేశారు. కాసేపట్లో రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నది. మరోవైపు పోసానిని అరెస్టు చేసిన తీరుపై ఆయన తరఫు లాయర్‌ ఫైర్‌ అయ్యారు. ఆయనకు 60 ఏళ్లు దాటాయని పోలీసులు సీనియర్‌ సిటిజన్‌ యాక్ట్‌ను పాటించలేదని ఆరోపించారు. పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరించారని విమర్శించారు. పోసాని అరెస్టు రాజకీయ కక్ష సాధింపు చర్యగా పేర్కొన్నారు.

పోసాని అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి లతతో మాజీ సీఎం జగన్‌ ఫోన్‌లో పరామర్శించారు. పోసాని అరెస్టు ఖండించిన జగన్‌.. మీరు అధైర్య పడవద్దని మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నాయకులను అక్కడి వెళ్లాలని సూచించినట్లు చెప్పారు.ఆయన భార్య మీడియాతో మాట్లాడుతూ.. పోసానికి ఆరోగ్యం బాగా లేదని చెప్పినా వినకుండా రాత్రికి రాత్రే పోలీసులు తీసుకెళ్లారు. పోలీసులు నాకు నోటీసులు ఇస్తే నేను తీసుకోను అని చెప్పాను. డే టైమ్‌లో తీసుకెళ్లవచ్చు కదా? రాత్రి పూట ఎందుకు అరెస్టు చేశారని మండిపడ్డారు. ఎక్కడి తీసుకెళ్తున్నారని అడిగితే ఏదో పీఎస్‌ చెప్పారు.

First Published:  27 Feb 2025 12:49 PM IST
Next Story