అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో చైతన్యపురికి చెందిన రవితేజ మృతి చెందాడు. అతని మరణవార్త విని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 2022 మార్చిలో అమెరికా వెళ్లిన రవితేజ మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. వాషింగ్టన్‌లో దుండగుల కాల్పుల్లో అతను అక్కడిక్కడే మృతి చెందాడు.