హుస్సేన్ సాగర్‌లో మిస్ అయిన బీటెక్ విద్యార్థి అజయ్ డెడ్‌బాడీ లభ్యమైంది. జనవరి 26న రాత్రి నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన భారతమాతకు మహా హారతి కార్యక్రమాన్ని చూసేందుకు స్నేహితులతో కలిసి వచ్చిన అజయ్ బోట్‌లో హుస్సేన్ సాగర్‌లోపలికి వెళ్లాడు. మహా హారతి ముగింపు సందర్భంగా బాణాసంచా కాల్చుతుండగా అవి రెండు బోట్లలో పడి భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఒకరు ఈరోజు ఉదయం మృతిచెందగా, అదే రోజు రాత్రి మిస్ అయిన అజయ్ మృతదేహం సంజీవయ్య పార్క్ వద్ద గల జాతీయ జెండా సమీపంలో లభ్యమైంది. వెంటనే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Previous Articleమౌనీ అమావాస్యకు కుంభమేళాకు వెళ్తున్నారా? ఈ నిబంధనలు మీ కోసమే!
Next Article సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జాన్ వెస్లీ
Keep Reading
Add A Comment