ఫార్ములా-ఈ రేస్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ హాజరయ్యారు. బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయానికి ఆయన వెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా ఫార్ములా ఈ ఆపరేషన్స్ (ఎఫ్‌ఈవో) సంస్థకు రూ. 45.71 కోట్ల బదిలీపై అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఆ కోణంలో అర్వింద్‌కుమార్‌ను విచారిస్తున్నట్లు సమాచారం.
Add A Comment