కర్ణాటకలో వరుస దొంగతనాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నిన్నటి బీదర్ ఘటన మరువక ముందే మంగళూరులోని కోపరేటివ్ బ్యాంకులో మరో చోరీ జరిగింది. ఇవాళ మంగళూరులోని కొటేకర్ కో ఆపరేటివ్ బ్యాంక్ లో భారీ చోరీకి పాల్పడ్డారు. బ్యాంక్ లోకి చొరబడి దోచుకెళ్లిన ఐదుగురు దొంగల ముఠా రూ. 15 కోట్ల విలువైన బంగారం, రూ. 5 లక్షల క్యాష్ చోరీ చేశారు. కర్ణాటకలో జరుగుతున్న వరుస ఘటనలు సామాన్యులతో పాటు అధికారులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. బ్యాంక్ లంచ్‌టైంలో దోపిడీ జరిగింది. ఐదుగురు దొంగలు చోరీకి పాల్పడ్డారన్న ఉద్యోగులు.. బీహార్ గ్యాంగ్ పనిగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దుండగులు.. ఫియట్ కార్‌లో వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
Add A Comment