Telugu Global
CRIME

హైకోర్టులో కేసు వాదిస్తుండ‌గా న్యాయ‌వాదికి గుండెపోటు

తెలంగాణ హైకోర్టులో కేసు వాదిస్తుండగా గుండెపోటుతో న్యాయవాది న్యాయవాది మృతి చెందాడు.

హైకోర్టులో కేసు వాదిస్తుండ‌గా న్యాయ‌వాదికి గుండెపోటు
X

తెలంగాణ హైకోర్టులో గుండెపోటుతో న్యాయవాది పసునూరి వేణుగోపాల్ మృతి చెందాడు. హైకోర్టులో ఓ కేసులో వాదనలు వినపిస్తూ అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలారు. హుటాహుటిన చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే న్యాయ‌వాది మృతి చెందిన‌ట్లు ఉస్మానియా వైద్యులు నిర్ధారించారు.

గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన న్యాయ‌వాదిని వేణు గోపాల‌రావుగా గుర్తించారు. సంతాపంగా 21వ కోర్టు హాలులో జ‌డ్జి విచార‌ణ‌ను నిలిపివేశారు. మిగిలిన కోర్టు హాళ్ల‌లోనూ రెగ్యుల‌ర్ పిటిష‌న్ల‌ను వాయిదా వేశారు. మృతుడి నివాసంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. న్యాయ‌వాది వేణుగోపాల‌రావు మృతిప‌ట్ల హైకోర్టు జ‌డ్జిలు, న్యాయ‌వాదులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు

First Published:  18 Feb 2025 4:15 PM IST
Next Story