సుదర్శన్ తో మరో ప్రయోగం
ఓ చిన్న సినిమాగా వస్తోంది లైక్-షేర్ అండ్ సబ్ స్క్రైబ్ మూవీ. అయితే దీనిపై బజ్ మాత్రం కాస్త ఎక్కువగానే ఉంది. సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా
కమెడియన్ సుదర్శన్ తో ఇప్పటికే ఓ ప్రయోగం జరిగింది. అతడే లీడ్ రోల్ గా ఓ వెబ్ సిరీస్ వచ్చింది. ఇప్పుడు మరోసారి సుదర్శన్ తో ప్రయోగం షురూ చేశారు. అయితే ఈసారి ఏకంగా సినిమానే తెరకెక్కించారు. అదే 'లైక్-షేర్-సబ్ స్క్రైబ్' మూవీ. హీరోహీరోయిన్ల తర్వాత ఈ సినిమాలో సుదర్శన్ దే కీలక పాత్ర. ఈ మేరకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.
వినోదంతో కూడిన వైవిధ్యమైన చిత్రాలు రూపొందిస్తూ, విలక్షణమైన కథాంశాలని ఎంచుకుంటూ తనకంటూ ఒక మార్క్ ని సంపాదించుకున్నాడు దర్శకుడు మేర్లపాక గాంధీ. తన సినిమాలన్నింటిలో వినోదం ప్రధానంగా ఉండేలా చూసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు, సంతోష్ శోభన్ తో 'లైక్ షేర్ & సబ్ స్క్రైబ్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సంతోష్ హీరోగా నటించిన సూపర్ హిట్' ఏక్ మినీ కథ' కు మేర్లపాక గాంధీ కథ, స్క్రీన్ ప్లే అందించాడు. వీరి కాంబోలో వస్తున్న రెండో చిత్రమిది.
లవ్ అండ్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో సంతోష్ శోభన్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది. వెంకట్ బోయనపల్లికి చెందిన నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఇటివలే విదుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్, టైటిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి నెల్లూరు సుదర్శన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జాక్ డేనియల్స్ గా సుదర్శన్ ఫస్ట్ లుక్ హిలేరియస్ గా ఉంది. ప్రవీణ్ లక్కరాజు ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తారు.