సికిందర్' టీజర్ వచ్చేసింది..అదరగొట్టిన కండలవీరుడు
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కాంబోలో వస్తున్న'సికందర్ టీజర్ విడుదల అయింది

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా ప్రముఖ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న మూవీ సికిందర్. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల అయింది. మరోసారి కండలవీరుడు సల్మాన్ ఖాన్ తనదైన స్టైల్‌లో ఇరగదీశారు. అలాగే మురుగదాస్ కూడా మళ్లీ తనదైన టేకింగ్‌తో టీజర్‌ను రిచ్‌గా చూపించారు. ఈ ఏడాది రంజాన్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. టీజర్ చూస్తే ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ సంవత్సరం సల్మాన్ ఖాన్ ఫస్ట్ మూవీ కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
సల్మాన్ గతేడాది సింగం ఎగైన్, బేబీ జాన్ చిత్రాల్లోనూ కనిపించారు. ఈ మూవీలో సల్మాన్ సరసన పుష్ప భామ రష్మిక మందన్నా నటిస్తున్నది. కాజల్ అగర్వాల్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.అయితే అంతకుముందు 2023లో టైగర్-3 మూవీతో ప్రేక్షకులను అలరించాడు సల్మాన్ ఖాన్. ఈ చిత్రం బాక్సాఫీస్ విఫలం కావడంతో సికందర్‌పైనే అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రం ఈద్ కానుకగా మార్చి 28న థియేటర్లలోకి రానుంది.