Telugu Global
Business

సూపర్ సెల్ఫీ కెమెరాతో ‘వివో వీ30’ సిరీస్ లాంఛ్! ఫీచర్లివే..

వివో నుంచి ‘వీ30’, ‘వీ30 ప్రో’ పేర్లతో రెండు వీ30 సిరీస్ ఫోన్లు ఇండియన్ మార్కెట్లోకి రానున్నాయి. వీటిలో వెనుక రెండు కెమెరాలు, ముందు ఒక సెల్ఫీ కెమెరా.. మొత్తం మూడు కెమెరాలు 50 మెగాపిక్సెల్ సెన్సర్‌‌తోనే వస్తుండడం విశేషం.

సూపర్ సెల్ఫీ కెమెరాతో ‘వివో వీ30’ సిరీస్ లాంఛ్! ఫీచర్లివే..
X

చైనీస్ మొబైల్ బ్రాండ్ వివో నుంచి మార్చి 7 న రెండు కొత్త మొబైల్స్ లాంఛ్ అయ్యాయి. 50 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కర్వ్‌డ్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఇందులో హైలైట్ అవ్వనున్నాయి. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

వివో నుంచి ‘వీ30’, ‘వీ30 ప్రో’ పేర్లతో రెండు వీ30 సిరీస్ ఫోన్లు ఇండియన్ మార్కెట్లోకి రానున్నాయి. వీటిలో వెనుక రెండు కెమెరాలు, ముందు ఒక సెల్ఫీ కెమెరా.. మొత్తం మూడు కెమెరాలు 50 మెగాపిక్సెల్ సెన్సర్‌‌తోనే వస్తుండడం విశేషం.

‘వివో వీ30’ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.78 అంగుళాల కర్వ్‌డ్‌ ఎఫ్‌హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్ ప్లే ఉంటుంది. ఇది120హెర్ట్జ్ రీఫ్రెష్‌ రేటుని సపోర్ట్ చేస్తుంది. 2,800 నిట్స్‌ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఇది క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 3 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 ఓఎస్‌పై రన్ అవుతుంది. ఇందులో వెనుక ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కలిగిన 50ఎంపీ ప్రైమరీ కెమెరా, మరో 50ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరాతో పాటు ముందు 50ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇందులో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేస్తుంది.

వివో వీ30 మొబైల్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌, బ్లూటూత్‌ 5.4, వైఫై 5, ఎన్‌ఎఫ్‌సీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ధరల విషయానికొస్తే.. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర - రూ.33,999, 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.35,999, 12జీబీ+256జీబీ ధర రూ.37,999 గా ఉన్నాయి. ఈ మొబైల్ అండమాన్‌ బ్లూ, పీకాక్‌ గ్రీన్‌, క్లాసిక్‌ బ్లాక్‌ అనే మూడు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

ఇక ‘వివో వీ30ప్రో’ మోడల్ ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే.. ఇది 6.78 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ కర్వ్‌డ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120హెర్ట్జ్ రీఫ్రెష్‌ రేటుని సపోర్ట్ చేస్తుంది. 2,800 నిట్స్‌ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. వీ30 ప్రో మోడల్.. మీడియాటెక్‌ డైమెన్సిటీ 8,200 జెన్‌ 5 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 ఓఎస్‌పై రన్ అవుతుంది. ఇందులో కూడా వెనుక రెండు 50ఎంపీ కెమెరాలు, ముందు50ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేస్తుంది.

ప్రో మొబైల్ లో బ్లూటూత్‌ 5.3, వైఫై 5, ఎన్‌ఎఫ్‌సీ వంటి ఫీచర్లున్నాయి. ధరల విషయానికొస్తే.. 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.41,999, 12జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ.46,999 గా ఉన్నాయి. ఇది అండమాన్‌ బ్లూ, క్లాసిక్‌ బ్లాక్‌ రంగుల్లో లభిస్తుంది.

First Published:  8 March 2024 3:56 PM IST
Next Story