Hyundai Grand i10 Nios | దక్షిణ కొరియా ఆటోమొబైల్ జెయింట్ హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) తన పాపులర్ హ్యాచ్‌బ్యాక్ (hatchback) కారు గ్రాండ్ ఐ10 నియోస్ కార్పొరేట్ (Hyundai Grand i10 Nios Corporate) వేరియంట్ మోడల్ కారును ఆవిష్కరించింది. ఇప్పటి వరకూ భారత్ మార్కెట్లో అందుబాటులో ఉన్న హ్యాచ్ బ్యాక్ మోడల్ కార్లలో ఇదే చౌక. హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కార్పొరేట్ (Hyundai Grand i10 Nios Corporate) వేరియంట్ కారు ధర రూ.6.93 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది.
హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కార్పొరేట్ వేరియంట్ కారు 1.2 లీటర్ల కప్పా పెట్రోల్ ఇంజిన్‌తో వస్తున్నది. ఈ ఇంజిన్ గరిష్టంగా 83 పీఎస్ విద్యుత్, 114 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభిస్తుందీ గ్రాండ్ ఐ10 నియోస్ కార్పొరేట్ వేరియంట్.
వేరియంట్ల వారీగా హ్యుండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కార్పొరేట్ వేరియంట్ ధరవరలు..
కార్పొరేట్ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ : రూ.6.93 లక్షలు.
కార్పొరేట్ వేరియంట్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ : రూ.7.58 లక్షలు.
ఇలా ఎక్స్‌టీరియర్ ఫీచర్లు..
15-అంగుళాల డ్యుయల్ టోన్ స్టైల్డ్ స్టీల్ వీల్స్
పెయింటెడ్ బ్లాక్ రేడియేటర్ గ్రిల్లె
బాడీ కలర్డ్ ఔట్‌సైడ్ డోర్ హ్యాండిల్స్ అండ్ ఓఆర్వీఎంస్
ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్
ఎల్ఈడీ డీఆర్ఎల్స్
7 మోనోటోన్ కలర్స్
టెయిల్ గేట్‌పై ఎక్స్‌క్లూజివ్ `కార్పొరేట్` ఎంబ్లం
ఇంటీరియర్ ఫీచర్లు ఇలా..
డ్యుయల్ టోన్ గ్రే ఇంటీరియర్
8.89-సీఎం స్పీడో మీటర్ విత్ ఎంఐడీ
డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్
ఫుట్ వెల్ లైటింగ్
ఫ్రంట్ రూమ్ ల్యాంప్
ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ బ్యాక్ ప్యాకెట్
ఇన్ఫోటైన్‌మెంట్ ఫీచర్లు ఇవీ..
17.14-సీఎం టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే
యూఎస్బీ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ విత్ ఫోర్ స్పీకర్స్
స్టీరింగ్ వీల్ మౌంటెడ్ కంట్రోల్స్ (ఆడియో అండ్ బ్లూటూత్ )
కన్వినియెంట్ ఫీచర్లు ఇలా ..
ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎంస్
ఆటో డౌన్ పవర్ విండో ఫర్ డ్రైవర్
రేర్ ఏసీ వెంట్స్
టైప్ సీ ఫాస్ట్ యూఎస్బీ చార్జర్
ప్యాసింజర్ వానిటీ మిర్రర్
రేర్ పవర్ ఔట్‌లెట్
ఇవీ సేఫ్టీ ఫీచర్లు..
టీపీఎంస్ – హైలైన్
6-ఎయిర్‌బ్యాగ్స్ స్టాండర్డ్
సీట్ బెల్ట్ రిమైండర్, 3-పాయింట్ సీట్ బెల్ట్స్ ఫర్ ఆల్ సీట్స్
డే అండ్ నైట్ ఐఆర్వీఎం
ఏబీఎస్ విత్ ఈబీడీ
సెంట్రల్ డోర్ లాకింగ్
ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్