Telugu Global
Business

Suzuki V-Strom 800DE | అడ్వాన్స్‌డ్ ఫీచ‌ర్ల‌తో సుజుకి వీ-స్ట్రోమ్ 800డీఈ బైక్‌.. రూ.10.30 ల‌క్ష‌ల‌కు ల‌భ్యం..!

Suzuki V-Strom 800DE | అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న సుజుకి వీ స్ట్రోమ్ 800డీఈ (Suzuki V-Strom 800DE) మోటారు సైకిల్‌ను సుజుకి మోటార్ సైకిల్ ఇండియా (Suzuki Motorcycle India) భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది.

Suzuki V-Strom 800DE | అడ్వాన్స్‌డ్ ఫీచ‌ర్ల‌తో సుజుకి వీ-స్ట్రోమ్ 800డీఈ బైక్‌.. రూ.10.30 ల‌క్ష‌ల‌కు ల‌భ్యం..!
X

Suzuki V-Strom 800DE | అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న సుజుకి వీ స్ట్రోమ్ 800డీఈ (Suzuki V-Strom 800DE) మోటారు సైకిల్‌ను సుజుకి మోటార్ సైకిల్ ఇండియా (Suzuki Motorcycle India) భార‌త్ మార్కెట్లో ఆవిష్క‌రించింది. దీని ధ‌ర రూ.10.30 ల‌క్ష‌ల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ మోటారు సైకిల్ చాంపియ‌న్ ఎల్లో (Champion Yellow), గ్లాస్ మ్యాట్టె మెకానిక‌ల్ గ్రే (Glass Matte Mechanical Grey), గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ (Glass Sparkle Black) రంగుల్లో ల‌భిస్తుంది.

సుజుకి వీ స్ట్రోమ్ 800 డీఈ (Suzuki V-Strom 800DE) మోటారు సైకిల్ 776సీసీ పార్ల‌ల్ ట్విన్ డీఓహెచ్‌సీ ఇంజిన్ క‌లిగి ఉంటుంది. ఇది 270-డిగ్రీ క్రాంక్‌షాఫ్ట్ ఉంట‌ది. సజావుగా సాగేందుకు వైబ్రేష‌న్‌ను అణ‌గ‌గొట్టేందుకు సుజుకి క్రాస్ బ్యాలెన్స‌ర్ సిస్ట‌మ్ ఉంటుంది. లిక్విడ్ కూలింగ్ సిస్ట‌మ్‌, 2-ఇన్‌టు 1 ఎగ్జాస్ట్ సిస్ట‌మ్ విత్ డ్యుయ‌ల్ స్టేస్ క్యాట‌లిక్ క‌న్వ‌ర్ట‌ర్‌, సుజుకి క్ల‌చ్ అసిస్ట్ సిస్ట‌మ్ ఉంటాయి.

హైలీ రిజిడ్ న్యూ స్టీల్ ఫ్రేమ్ ఆధారంగా సుజుకి వీస్ట్రోమ్ 800డీఈ (Suzuki V-Strom 800DE) మోటారు సైకిల్ రూపుదిద్దుకున్న‌ది. 220 ఎంఎం వీల్ ట్రావెల్ ఇన్వ‌ర్టెడ్ హిటాచీ అస్టెమో-షోవా (Hitachi Astemo -Showa) ఫ్రంట్ ఫోర్క్స్, అడ్జ‌స్ట‌బుల్ స్ప్రింగ్ ప్రీలోడ్ తోపాటు హిటాచీ అస్టెమో (షోవా) మోనోషాక్ రేర్ స‌స్పెన్ష‌న్ ఉంటుంది. 220 ఎంఎం గ్రౌండ్ క్లియ‌రెన్స్‌తోపాటు వీ-స్ట్రోమ్ మోడ‌ల్ మోటారు సైకిళ్ల‌లో సుజుకి వీ-స్ట్రోమ్ 800డీఈ పొడ‌వైంది. ఫ్రంట్‌లో 310 ఎంఎం డ్యుయ‌ల్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. వైర్ స్పోక్డ్, సెమీ బ్లాక్ ప్యాట‌ర్న్డ్ 21-అంగుళాల ఫ్రంట్‌, 17- అంగుళాల డ‌న్‌ల‌ప్ వీల్స్ ఉంటాయి.

సుజుకి వీ-స్ట్రోమ్ 800 డీఈ (Suzuki V-Strom 800DE) మోటారు సైకిల్ త‌న ఐకానిక్ వీ-స్ట్రోమ్ `బీక్‌`తో వ‌స్తుంది. ఇంత‌కుముందు మోటారు సైకిళ్ల‌లో వాడిన‌దానికంటే పెద్ద‌గా ఉంటుంది. క‌స్ట‌మైజ్డ్ 5-అంగుళాల క‌ల‌ర్డ్ టీఎఫ్‌టీ ఎల్‌సీడీ మ‌ల్టీ ఇన్‌ఫ‌ర్మేష‌న్ స్క్రీన్ విత్ డే అండ్ నైట్ మోడ్స్‌, క్ల‌స్ట‌ర్‌కు ఎడ‌మ వైపున యూఎస్బీ పోర్ట్‌, హెక్సాగోన‌ల్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్‌, ఎల్ఈడీ పొజిష‌నింగ్ లైటింగ్‌, ఎల్ఈడీ టెయిల్ లైట్, ఎల్ఈడీ ట‌ర్న్ సిగ్న‌ల్స్ త‌దిత‌ర ఫీచ‌ర్లు ఉంటాయి. మోటారు సైకిల్ 20 లీట‌ర్ల ఫ్యుయ‌ల్ ట్యాంక్ క‌లిగి ఉంటుంది.

వీ-స్ట్రోమ్ 800 డీఈ మోటారు సైకిల్.. సుజుకి ఇంటెలిజెంట్ రైడ్ సిస్ట‌మ్ (ఎస్ఐఆర్ఎస్‌)తో వ‌స్తుంది.ఎంట్రీ లెవ‌ల్ జీ (గ్రావెల్‌) మోడ్ మోటారు సైకిళ్ల‌లో సుజుకి డ్రైమ్ మోడ్ సెలెక్ట‌ర్ (ఎస్డీఎంఎస్‌), సుజుకి ట్రాక్ష‌న్ కంట్రోల్ సిస్ట‌మ్ (ఎస్టీఎస్సీ), రైడ్ బై వైర్ ఎల‌క్ట్రానిక్ థ్రొట్టెల్ సిస్ట‌మ్‌, బై డైరెక్ష‌న‌ల్ క్విక్ షిఫ్ట్ సిస్ట‌మ్ (విత్ ఆఫ్ లేదా ఆన్ సెట్టింగ్స్‌), టూ మోడ్ ఏబీఎస్‌, సుజుకి ఈజీ స్టార్ట్ సిస్ట‌మ్‌, లో ఆర్పీఎం అసిస్ట్ త‌దిత‌ర ఫీచ‌ర్లు ఉంటాయి.

First Published:  2 April 2024 7:35 AM GMT
Next Story