Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Tuesday, May 13
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»Business

    Royal Enfield Bullet 350 | కొత్త‌గా రెండు క‌ల‌ర్స్‌లో ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350.. బేస్ మోడ‌ల్‌తో పోలిస్తే కాస్ట్‌లీ..!

    By Telugu GlobalJanuary 26, 2024Updated:March 30, 20252 Mins Read
    Royal Enfield Bullet 350 | కొత్త‌గా రెండు క‌ల‌ర్స్‌లో ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350.. బేస్ మోడ‌ల్‌తో పోలిస్తే కాస్ట్‌లీ..!
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    Royal Enfield Bullet 350 | ప్ర‌ముఖ ద్విచ‌క్ర వాహ‌నాల త‌యారీ సంస్థ రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) త‌న బుల్లెట్ 350 మోటారు సైకిల్ ను తాజాగా రెండు కొత్త క‌ల‌ర్ ఎడిష‌న్ల‌లో మార్కెట్ల‌లో ఆవిష్క‌రించింది. మిలిట‌రీ సిల్వ‌ర్ ఎడిష‌న్‌లో వ‌చ్చిన రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 మోటారు సైకిల్ తాజాగా మిలిట‌రీ సిల్వ‌ర్ బ్లాక్, మిలిట‌రీ సిల్వ‌ర్ రెడ్ క‌ల‌ర్స్‌లో ల‌భిస్తుంది. బేసిక్ రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 మోటారు సైకిళ్ల‌తో పోలిస్తే ఈ రెండు క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌తో వ‌చ్చే బుల్లెట్ ధ‌ర ఎక్కువ‌. ఈ మోటారు సైకిల్ ధ‌ర రూ.1.79 ల‌క్ష‌ల నుంచి ప్రారంభం అవుతుంది. జావా 350, హోండా హెచ్ఎన్ఈఎస్ఎస్ సీబీ350 మోటారు సైకిళ్ల‌తో రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 బైక్ పోటీ ప‌డుతుంది.

    విశ్వ‌జ‌నీన డిజైన్ కావ‌డంతో మిలిట‌రీ సిల్వ‌ర్ ఎడిష‌న్ ఆక‌ర్ష‌ణీయంగా ఉంటుంది. రెండు క‌ల‌ర్ ఆప్ష‌న్లు – మిలిట‌రీ సిల్వ‌ర్ బ్లాక్‌, మిలిట‌రీ సిల్వ‌ర్ రెడ్ వేరియంట్ల ఫ్యుయ‌ల్ ట్యాంక్‌పై హ్యాండ్ పెయింటెడ్ లైన్స్ (పిన్ స్ట్రిప్స్‌) ఉంటాయి. మ‌రింత స్టైలిష్‌గా మిలిట‌రీ సిల్వ‌ర్ బ్లాక్ / రెడ్ క‌ల‌ర్ వేరియంట్ బుల్లెట్ 350 క‌నిపిస్తాయి. సేఫ్టీ కోసం మిలిట‌రీ సిల్వ‌ర్ మోడ‌ల్ బైక్స్ ఫ్రంట్‌లో 300 ఎంఎం బ్రేక్ డిస్క్‌, బ్యాక్‌లో 153 ఎంఎం డ్ర‌మ్ బ్రేక్ విత్ సింగిల్ చానెల్ ఏబీఎస్‌తో వ‌స్తుంది.

    రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ 350 బుల్లెట్ ఇంజిన్ జే-సిరీస్ ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకున్న‌ది. ఈ ఇంజిన్ 349సీసీ సింగిల్ సిలిండ‌ర్, ఎయిర్ కూల్డ్‌ విత్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్‌తో వ‌స్తుంది. ఫ్రంట్‌లో టెలిస్కోపిక్ ఫోర్క్స్‌, డ్యుయ‌ల్ రేర్ షాక్స్, రోడ్ బ‌యాస్డ్ టైర్ల‌తోపాటు ఫ్రంట్‌లో 19 అంగుళాలు, రేర్‌లో 18-అంగుళాల స్పోక్ వీల్స్ ఉంటాయి.

    బేస్ మోడ‌ల్ మిలిట‌రీ రెడ్ లేదా మిలిట‌రీ బ్లాక్ వేరియంట్‌తో పోలిస్తే టాప్ ఎండ్ వేరియంట్ మోటారు సైకిల్ బ్లాక్ గోల్డ్ రాయ‌ల్ ఎన్‌ఫీల్ట్ బుల్లెట్ 350 వేరియంట్ రూ.42,239 ఎక్కువ‌. డ్యుయ‌ల్ చానెల్ ఏబీఎస్‌తోపాటు రేర్ డిస్క్ బ్రేక్‌, డార్క‌ర్ ఇంజిన్‌, ఎగ్జాస్ట్‌, 3డీ బ్యాడ్జెస్‌, హెడ్‌లైట్ విజ‌ర్ వంటి అద‌న‌పు ఫీచ‌ర్లు జ‌త చేశారు. అయిన‌ప్ప‌టికీ న్యూ మిలిట‌రీ సిల్వ‌ర్ ఎడిష‌న్ బుల్లెట్ 350 బైక్స్ మ‌రింత బ‌డ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. బీఎస్ 6.2 ప్ర‌మాణాల‌కు అనుగుణంగా రూపుదిద్దుకున్న బుల్లెట్ 350 బైక్ గ‌రిష్టంగా 6100 ఆర్పీఎం వ‌ద్ద‌ 20.2 హెచ్‌పీ విద్యుత్‌, 4000 ఆర్పీఎం వ‌ద్ద‌ 27 ఎన్ఎం టార్క్ వెలువ‌రిస్తుంది.

    బుల్లెట్ మిలిట‌రీ, బుల్లెట్ మిలిట‌రీ సిల్వ‌ర్ (న్యూ), బుల్లెట్ స్టాండ‌ర్డ్‌, బుల్లెట్ బ్లాక్ గోల్డ్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో బుల్లెట్ 350 వ‌స్తుంది. బేస్ బుల్లెట్ మిలిట‌రీ మిన‌హా అన్ని బుల్లెట్లు హ్యాండ్ పెయింటెడ్ పిన్ స్ట్రైప్స్‌తో వ‌స్తాయి. వీటి ధ‌ర‌లు ఇలా..

    మిలిట‌రీ రెడ్ / మిలిట‌రీ బ్లాక్ : రూ.1,73,562

    న్యూ మిలిట‌రీ సిల్వ‌ర్‌ రెడ్ / సిల్వ‌ర్ బ్లాక్ : రూ.1,79,000

    స్టాండ‌ర్డ్ – మిలిట‌రీ రెడ్ మారూన్ / బ్లాక్‌: రూ.1,97,436

    బ్లాక్ గోల్డ్: రూ. 2,15,801

    Royal Enfield Royal Enfield Bullet 350
    Previous ArticleTecno Spark 20 | టెక్నో నుంచి బ‌డ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ టెక్నో స్పార్క్ 20.. ఇవీ స్పెషిఫికేష‌న్స్‌..?!
    Next Article హైదరాబాద్ టెస్ట్ మూడురోజుల ముచ్చటేనా?
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.