Reliance Digital | ఈ నెల ఆరో తేదీ నుంచి రిలయన్స్ డిజిటల్ (Reliance Digital) డిజిటల్ డిస్కౌంట్ డేస్ సేల్స్ ప్రకటించింది. ఈ నెల 15 వరకూ డిస్కౌంట్ సేల్స్ కొనసాగుతాయి. వివిధ శ్రేణుల ఎలక్ట్రానిక్స్ వస్తువులు డిస్కౌంట్ ధరలకే అందుబాటులో ఉంటాయని రిలయన్స్ డిజిటల్ తెలిపింది. అదనపు ఎక్స్చేంజ్ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు కూడా లభిస్తాయి. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, లాప్‌టాప్‌లు, సౌండ్ బార్లు తదితర వస్తువులు తక్కువ ధరకుప పొందొచ్చు. లీడింగ్ బ్రాండ్లపై డిస్కౌంట్ ధరలకు అందిస్తామని రిలయన్స్ డిజిటల్ తెలిపింది. రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్‌లో లభిస్తాయి. లీడింగ్ బ్యాంకు కార్డులపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్, రూ.15 వేల వరకూ కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఉంటుంది.
ఎల్‌జీ ఓలెడ్, శాంసంగ్ నియో క్యూలెడ్ స్మార్ట్ టీవీలపై 45 శాతం డిస్కౌంట్ ప్రకటించింది రిలయన్స్ డిజిటల్. దీని ధర రూ.79,990 నుంచి ప్రారంభం అవుతుంది. 43-అంగుళాల ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ టీవీలు, ఇతర బ్రాండ్లపై 40శాతం డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. దీని ధర రూ.16,990 నుంచి ప్రారంభం అవుతుంది.
ఆపిల్ తన ఐ-ఫోన్ మోడల్స్ తక్కువ ధరలకే లభిస్తాయి. అన్ని రకాల ఐ-ఫోన్లపై డబుల్ ఎక్స్చేంజ్ బోనస్ రూ.12 వేల లభిస్తుంది. ఆపిల్ మ్యాక్ బుక్ ఎం1 ధరపై 33 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. రోజుకు రూ.54 చొప్పున నో-కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంటుంది. 64జీబీ వై-ఫై వేరియంట్ నైన్త్ జనరేషన్ ఐ-పాడ్ రూ.23,900లకే లభిస్తుంది. గేమింగ్ లాప్‌టాప్‌లు డిస్కౌంట్ ధరపై రూ.49,999లకు లభిస్తాయి. బోస్ సౌండ్ బార్ 900.. 30 శాతం డిస్కౌంట్‌పై రూ.72,990, డోల్బీ అట్మోస్ సౌండ్ బార్లు 65 శాతం ధరకు రూ.17,990లకు సొంతం చేసుకోవచ్చు.
ఎయిర్ కండీషనర్లు, వాషింగ్ మిషన్ల వంటి గృహోపకరణాలు కూడా డిస్కౌంట్ ధరకే లభిస్తాయి. 1-టోన్ 3-స్టార్ ఇన్వెస్టర్ ఏసీలు రూ.20,990, హై ఎండ్ 11 కిలోల లేదా ఏడు కిలోల వాషింగ్ మిషన్లు (డ్రైయర్లతో కలిపి) రూ.61,990లకు లభిస్తాయి. రిఫ్రిజిరేటర్లు (ప్రిజ్‌లు) రూ.49,990 ధరకు సొంతం చేసుకోవచ్చునని రిలయన్స్ డిజిటల్ తెలిపింది.