Gold Rate | ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఇన్వెస్టర్లు తమకు సురక్షిత పెట్టుబడి మార్గంగా బంగారం వైపు మళ్లుతున్నారు. అందువల్లే అంతర్జాతీయ, దేశీయ బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలకు రెక్కలొస్తున్నాయి. దేశంలో 24 క్యారట్ల బంగారం తులం ధర మంగళవారం రూ.880 పెరిగి రూ.73,100 పలికితే ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారట్ల బంగారం పది గ్రాముల ధర రూ.67 వేల వద్ద స్థిర పడింది. చెన్నైలో 24 క్యారట్ల బంగారం ధర రూ.74,950 వద్ద ముగిసింది. వీటిపై జీఎస్టీ, ఇతర సుంకాలు అదనం. దీంతో తులం బంగారం ధర రూ.76 వేల మార్కును దాటేసినట్లే.
ఇక కిలో వెండి ధర కూడా రూ.86,100 వద్ద నిలిచింది. అంతర్జాతీయంగా న్యూయార్క్‌లో ఔన్స్ బంగారం ధర 0.16 శాతం పుంజుకుని 2386.8 డాలర్ల వద్ద స్థిర పడింది. ఔన్స్ వెండి ధర మాత్రం 0.21 శాతం పతనంతో 28.84 డాలర్లకు చేరుకున్నది. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో జూన్ ఐదో తేదీ గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ ధర రూ.72,837, మే మూడో తేదీ వెంటి కాంట్రాక్ట్ ధర రూ.84,192 వద్ద ముగిసింది.
దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు
నగరం – 22 క్యారట్స్ – – – 24 క్యారట్స్ (రూ.ల్లో)
ఢిల్లీ — – 67,210 – – – 73,310
ముంబై – 67,060 – – – 73,160
అహ్మదాబాద్- 67,110 -73,210
చెన్నై -68,700 -74,950
కోల్‌కతా – 67,060 – 73,160
గురుగ్రామ్ – 67,210 – 73,310
లక్నో – 66,210 – 73,310
బెంగళూరు – 67,060 – 73,160
జైపూర్ – 67,210 – 73,310
పాట్నా – 67,110 – 73,210
భువనేశ్వర్ – 67,060 – 73,160
హైదరాబాద్ – 67,060 – 73,160