ఫిట్టింగ్: (కార్డు కథ)
BY Telugu Global30 Jun 2023 2:32 PM IST

X
Telugu Global Updated On: 30 Jun 2023 2:32 PM IST
సుబ్బారావు పెళ్ళాంతో రెడీ మేడ్ బట్టల షాపు కు వెళ్ళాడు. ఆమె ఒక డ్రెస్ తీసుకుంది. అయిదు వేలు అయింది.
"సైజ్ ఫిట్టింగ్ మేమే చేయించి ఇస్తాం. పది నిమిషాలు ఆగండి" అన్నాడు షాపువాడు.
సరే అని షాపు లోనే కూర్చున్నారు.
"ఇప్పుడు కొత్త రకం డిజైన్లు వచ్చాయి. మేడం ఊరికే చూడండి." అంటూ కొత్తరకం డ్రెస్ చూపించి అంట గట్టాడు. ఆరు వేలు బిల్లు అయింది.
"ఇది కూడా ఫిట్టింగ్ చేయించి ఇస్తాం. పది నిమిషాలు ఆగండి" అన్నాడు షాపు వాడు.
"నీ ఫిట్టింగ్ నాకు అర్ధమైంది. మేం అర గంటలో కాఫీ తాగి వస్తాo,రెడీ చేసి ఉంచు " అని లేచాడు సుబ్బారావు.
- శ్రీధర
Next Story