హోం మంత్రి రాజీనామాకు విజయసాయి డిమాండ్
ఏపీ హోం మంత్రి మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదన్నారు విజయసాయిరెడ్డి. 'బొల్లి' మాటలతో కాలక్షేపం చేయడం వల్ల, రాష్ట్రం భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో హత్యలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. హత్యలు జరగకుండా చూడటంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. బాధ్యతలు నిర్వర్తించడంలో హోంమంత్రి విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. ఏపీలో జరుగుతున్న ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ హోం మంత్రి రాజీనామా చేయాలని విజయసాయి డిమాండ్ చేశారు.
హోమ్ మంత్రి మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదు, 'బొల్లి' మాటలతో కాలక్షేపం చేయడం వల్లనే, రాష్ట్రం భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయింది, బయటకు వస్తె, ఏమవుతుందో తెలియని దారుణ స్థితి, దీనికి బాధ్యత హోమ్ మంత్రిదే. హత్యలు జరగకుండా చూడడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది ఇది హోం మంత్రి…
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 28, 2024
ఏపీ హోం మంత్రి మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదన్నారు విజయసాయిరెడ్డి. 'బొల్లి' మాటలతో కాలక్షేపం చేయడం వల్ల, రాష్ట్రం భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇల్లు దాటి బయటకు వస్తె, ఏమవుతుందో తెలియని దారుణ స్థితిలో సామాన్యులు ఉన్నారన్నారు. వీటన్నిటికీ హోం మంత్రి పూర్తి బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వ వైఫల్యంపై గవర్నర్ విచారణకు ఆదేశించాలని కోరారు విజయసాయిరెడ్డి.
రాష్ట్రపతి పాలన..
ఏపీలో ప్రభుత్వం విఫలమైందని, వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలంటూ ఇటీవల వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే డిమాండ్ తో ఢిల్లీలో వైసీపీ నేతలు ధర్నా కూడా చేపట్టారు. తాజాగా హోం మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. దీనిపై టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.