గుడివాడలో కాపు వర్సెస్ బీసీ!
ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఎన్నికలపుడు సైలెంట్‌గానే ఉన్నా, కూటమి గెలిచాక నియోజకవర్గంలో హల్‌చల్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

టీడీపీ, జనసేనల మధ్య విభేదాలు మొదలయ్యాయి. కృష్ణాజిల్లా గుడివాడ వేదికగా ఇరుపార్టీల మధ్య వైరం బయటపడింది. గుడివాడలో అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. నాగవరప్పాడు వంతెన దగ్గర ఉన్న జనసేన పార్టీ దిమ్మెను టీడీపీ నేత ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన జనసేన కార్యకర్తలపైనా దాడిగి దిగారని చెబుతున్నారు. పార్టీ దిమ్మె ధ్వంసంతో జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో నాగవరప్పాడు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
జనసేన పార్టీ దిమ్మెను ధ్వంసం చేసింది టీడీపీకి చెందిన బీసీనేత దారం నరసింహారావు అని చెప్తున్నారు. ఈయన ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఎన్నికలపుడు సైలెంట్‌గానే ఉన్నా, కూటమి గెలిచాక నియోజకవర్గంలో హల్‌చల్ చేస్తున్నట్లు చెబుతున్నారు. నియోజకవర్గ బీసీ సంఘం అధ్యక్షులుగా ఉన్న నరసింహారావు జనసేన దిమ్మెను ధ్వంసం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆపార్టీ ఇన్‌ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. బాధ్యుడిపై చర్యలు తీసుకునే వరకు ఊరుకోమన్నారు.