మహా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించిన పవన్ దంపతులు
ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ పవిత్ర స్నానం చేశారు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించారు. అంతకు ముందు ఆయన త్రివేణి సంగమం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. మహాకుంభమేళాలో పాల్గొనడం అందరికీ గొప్ప అవకాశం అని పవన్ అన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న యూపీ ప్రభుత్వాన్నికి ధన్యవాదాలు తెలిపారు. జనవరి 13వ తేదీన ప్రారంభమైన మహా కుంభమేళా ఈనెల 26వ తేదీతో ముగియనుంది. దీంతో భక్తులు భారీగా తరలి వెళుతున్నారు. ప్రయాగ్‌రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి.
ఈ సందర్భంగా లక్షలాది భక్తులు పవిత్ర స్నానాలు తీసుకుని ఆధ్యాత్మిక అనుభూతులను పొందుతున్నారు. ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచిన ఈ మహాకుంభమేళాలో పాల్గొనేందుకు భక్తులు నిత్యం తరలివస్తున్నారు. ముఖ్యంగా మహా కుంభమేళా యొక్క విశ్వాస, ఉత్సాహం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులను ఆకర్షిస్తోంది. మరోవైపు ఆదివారం ఒక్కరోజే సాయంత్రం 6 గంటల వరకు 1.36కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చినట్లు యూపీ సర్కార్ వెల్లడించింది